- Home
- Entertainment
- నేను స్టార్ కిడ్ ని కాదు, అందుకే ఇలా చేస్తున్నా.. పవన్, ప్రభాస్ చిత్రాలపై హీరోయిన్ క్రేజీ కామెంట్స్
నేను స్టార్ కిడ్ ని కాదు, అందుకే ఇలా చేస్తున్నా.. పవన్, ప్రభాస్ చిత్రాలపై హీరోయిన్ క్రేజీ కామెంట్స్
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తుండగా మరోవైపు ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది.

Nidhhi Agarwal
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తుండగా మరోవైపు ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల గురించి మాట్లాడుతూ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే నిధి అగర్వాల్ నుంచి 2022 తర్వాత ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు.
Nidhhi Agarwal
దీని గురించి నిధి అగర్వాల్ స్పందిస్తూ.. నేనేం స్టార్ కిడ్ ని కాదు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. నాకు ఛాన్సులు వస్తున్నాయి అంటే అదే గొప్ప విజయం. ఎక్కువ సినిమాల్లో నటించాలనే కోరిక ప్రతి నటికి ఉంటుంది. కానీ దానికంటే ముఖ్యమైనది నమ్మకం ఉన్న కథలని ఎంచుకోవడం. నేను ప్రస్తుతం నమ్మకమున్న కథలనే ఎంచుకుంటున్నా. ఒకే తరహా చిత్రాలు చేస్తూ ఉంటే విమర్శలు వస్తాయి.
Nidhhi Agarwal
అందుకే గొప్పగా అనిపించిన కథలపైనే దృష్టి పెట్టినట్లు నిధి అగర్వాల్ తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రంలో నేను చేస్తున్న పాత్ర నా కెరీర్ లోనే అత్యుత్తమమైనది అని నిధి అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రం కోసం నేను హార్ రైడింగ్, కథక్ నాట్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు అదృష్టవంతురాలిని.
Nidhhi Agarwal
ఇక రాజా సాబ్ విషయానికి వస్తే నాకు గతంలో హర్రర్ చిత్రాలంటే భయంగా ఉండేది. కానీ ఈ చిత్ర షూటింగ్ లో ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నా. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరి ప్రోత్సాహం మరువలేనిది. పవన్ కళ్యాణ్ గారు సెట్స్ లో చాలా ఏకాగ్రతతో ఉంటారు. ఇతర విషయాలు పట్టించుకోరు. ఆయన నుంచి నేను కూడా ఆ లక్షణం నేర్చుకున్నా అని నిధి పేర్కొంది. రాజా సాబ్, హరి హర వీరమల్లు రెండు చిత్రాలు సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.