- Home
- Entertainment
- నయనతార, హన్సిక తర్వాత స్టార్ హీరోతో ప్రేమలో నిధి అగర్వాల్.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ..
నయనతార, హన్సిక తర్వాత స్టార్ హీరోతో ప్రేమలో నిధి అగర్వాల్.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ..
శింబు జీవితంలో కొత్త ప్రేమ చిగురించినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. గ్లామర్ పరంగా తిరుగులేదనిపించుకుంటున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో శింబు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు సహజం. హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ గురించి తరచుగా వార్తలు వింటూనే ఉంటాయి. వాటిలో కొన్ని గాసిప్స్ గానే మిగిలిపోతే. మరికొన్ని నిజమవుతూ ఉంటాయి. గత ఏడాది సెలెబ్రిటీల మధ్య కొన్ని బ్రేకప్స్ చూశాం. ఈ ఏడాది కొత్త ప్రేమలు చిగురిస్తునట్లు సంకేతాలు అందుతున్నాయి.
తమిళ స్టార్ హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో ఉన్న రొమాంటిక్ హీరోలలో శింబు ఒకడు. బ్రేకప్ ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా శింబు గురించే చెప్పుకోవాలి. ఈ స్టైలిష్ హీరోకి లైఫ్ లో ఇంతవరకు ప్రేమ అనే మాట కలసి రాలేదు. రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి పీటల వరకు వెళ్లి విఫలం అయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార, ఆపిల్ బ్యూటీ హన్సిక తో శింబు నడిపిన ప్రేమ వ్యవహారాలు సౌత్ లో హాట్ టాపిక్.
వీరిద్దరితో శింబు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో ఒక రేంజ్ లో రొమాన్స్ చేశారు. ఇక పెళ్లి మాత్రమే మిగిలి ఉంది అనుకుంటున్న తరుణంలో నయనతార, హన్సిక ఇద్దరితో బ్రేకప్ అయింది. హన్సికతో అయితే శింబు కుటుంబ సభ్యులు కూడా పెళ్ళికి అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని శింబు తండ్రి రాజేందర్ పలు సందర్భాల్లో ఓపెన్ గా ప్రకటించాడు.
ఇదిలా ఉండగా శింబు జీవితంలో కొత్త ప్రేమ చిగురించినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. గ్లామర్ పరంగా తిరుగులేదనిపించుకుంటున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో శింబు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది జనవరిలో విడుదలైన ఈశ్వరన్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నిధి అగర్వాల్, శింబు ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారట. శింబు త్వరలోనే పెళ్ళి పీటలెక్కేందుకు కూడా ఈ జంట రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి శింబు మూడవసారి అయినా ప్రేమలో సక్సెస్ అవుతాడేమో చూడాలి.
శింబు రీసెంట్ గా నటించిన మానాడు చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఇక నిధి అగర్వాల్ నటించిన హీరో చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఈ యంగ్ బ్యూటీ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.