MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలిమినేట్ కాబోయేది ఎవరో హింట్ ఇచ్చినట్లేనా ?.. చంటి, శ్రీ సత్య సేఫ్.. ఫైమాకి నాగ్ ఫిదా..

ఎలిమినేట్ కాబోయేది ఎవరో హింట్ ఇచ్చినట్లేనా ?.. చంటి, శ్రీ సత్య సేఫ్.. ఫైమాకి నాగ్ ఫిదా..

7వ రోజు శనివారం నాగార్జున బిగ్ బాస్ 6 వేదికపైకి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో అనేక విషయాలు మాట్లాడారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 10 2022, 10:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Star maa/Hotstar

Star maa/Hotstar

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం ముగియక ముందే రసవత్తరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య వాడి వేడిగా గొడవలు, మాటల యుద్ధం మొదలైపోయాయి. ఇంతలోనే ఫస్ట్ వీకెండ్ కి టైం వచ్చేసింది. 7వ రోజు శనివారం నాగార్జున బిగ్ బాస్ 6 వేదికపైకి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో అనేక విషయాలు మాట్లాడారు. ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. 

27
Star maa/Hotstar

Star maa/Hotstar

గీతూ రాయల్, ఆది రెడ్డి మధ్య నామినేషన్స్ లో ఉన్న సభ్యుల గురించి సీక్రెట్ గా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక కపుల్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన మెరీనా, రోహిత్ జంట మధ్య రొమాన్స్ కొనసాగుతోంది. పక్కన ఎవరూ లేనప్పుడు రోహిత్.. మెరీనాకి సీక్రెట్ గా ముద్దు పెడతాడు. ఇంతలో నేహా, రాజ్ లకి బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇస్తారు. ఇద్దరి ఇంటి సభ్యుల నుంచి వారికి స్పెషల్ గిఫ్ట్స్ వచ్చాయి. 

37
Star maa/Hotstar

Star maa/Hotstar

కానీ వారిద్దరిలో ఒకరికి మాత్రమే గిఫ్ట్ అందుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ఎవరికోసం త్యాగం చేస్తారో తేల్చుకోవాలని వారిద్దరికి బిగ్ బాస్ సూచిస్తారు. రాజ్.. నేహా కోసం త్యాగం చేస్తాడు. నేహా తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బర్త్ డే కేక్ అందుకుంటుంది. తన సోదరుడు హౌస్ బయటే ఉంది ఆమె బర్త్ డే ని సెలెబ్రేట్ చేస్తాడు. దీనితో నేహా సంతోషం పట్టలేక ఎమోషనల్ అవుతుంది. 

47
Star maa/Hotstar

Star maa/Hotstar

ఇక నాగార్జున రంగంలోకి దిగారు. ఒక్కో కంటెస్టెంట్ పేరు ప్రస్తావిస్తూ వారి తప్పులని ఎత్తి చూపారు. బాగా పెర్ఫామ్ చేసిన వారిని అభినందించారు. ముందుగా అభినయశ్రీ ఫస్ట్ వీక్ పెర్ఫామెన్స్ కి నాగ్ థంబ్స్ డౌన్ ఇచ్చారు. ఆమె ఆల్రెడీ నామినేషన్ లో ఉంది. దీనితో ఆమె ఎలిమినేషన్ గురించి నాగ్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్జున్ కళ్యాణ్ పెర్ఫామెన్స్ ని నాగ్ మెచ్చుకున్నారు. సంచలకురాలిగా ఫైమా అద్భుతంగా చేసింది అని ప్రశంసలు దక్కాయి. నాగ్ స్వయంగా ఆమెకి క్లాప్స్ కొట్టడం విశేషం. 

57
Star maa/Hotstar

Star maa/Hotstar

రేవంత్, ఆరోహి గొడవలో దూరిన వారికి నాగ్ చురకలంటించారు. ఇక గీతూ కూడా బాగా ఆడుతోంది అని కాకపోతో కాస్త మాట తీరు మార్చుకోవాలని నాగార్జున సూచించారు. ఇక చలాకి చంటి సుర్రు సుమ్ము అయిపోద్ది అని హౌస్ లోకి వెళ్ళాడు. కానీ ఆ స్థాయిలో ఆడడం లేదు అని నాగార్జున అన్నారు. కెప్టెన్ బాలాదిత్యని నాగ్ అభినందించారు. చాలా స్మూత్ గా హౌస్ ని హ్యాండిల్ చేస్తున్నాడు అని ప్రశంసించారు. 

67
Star maa/Hotstar

Star maa/Hotstar

ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. అభినయశ్రీ, శ్రీ సత్య, ఫైమా, చంటి, రేవంత్, ఇనయ, ఆరోహి నామినేషన్స్ లో ఉన్నారు. వీరందరికి వారి పేర్లు ఉన్న కార్డ్స్ ఇస్తారు. నాగార్జున చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు వారి కార్డ్స్ ని ఓపెన్ చేయాలి. రెడ్ నేమ్ ఉన్నవారు నాట్ సేఫ్.. గ్రీన్ లో ఉన్నవారు సేఫ్. అలా శ్రీ సత్య మాత్రమే సేఫ్ అవుతుంది. 

77
Star maa/Hotstar

Star maa/Hotstar

మధ్యలో చిన్న గేమ్ ఆడిన తర్వాత మరోసారి నామినేషన్స్ ఉన్నవారిని సేవ్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈసారి నామినేషన్స్ లో ఉన్నవారికి బాటిల్స్ ఇస్తారు. ఆ బాటిల్స్ లో పేపర్ లో మెసేజ్ ఉంటుంది. ఆ పేపర్ లో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారా లేదా అని రాసి ఉంటుంది. ముందుగా అభినయశ్రీ బాటిల్ ని ఓపెన్ చేయగా అన్ సేఫ్ అని రాసి ఉంటుంది. దీనితో ఆమె నామినేషన్స్ లో కొనసాగుతుంది. చంటి మాత్రమే సేఫ్ అవుతాడు. చివరికి నామినేషన్స్ లో అభినయ శ్రీ, ఇనయ, ఆరోహి, రేవంత్, ఫైమా మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిలో సేఫ్ అయ్యేది ఎవరు.. తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది రేపు సండే తేలనుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj : రామాయణంపై జోకులు.. ప్రకాశ్ రాజ్‌పై కేసు.. ఇంతకీ ఏమన్నారంటే?
Recommended image2
Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Recommended image3
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved