Allu Arjun-Pushpa:అందరూ పేయిడ్ పుష్ప రాజ్ లే... ఎంత మోసం అంతా స్క్రిప్టెడ్ నా?
పుష్ప రాజ్ గా అల్లు అర్జున్(Allu Arjun) నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. దాదాపు అన్ని భాషల్లో పుష్ప హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా పుష్ప హిందీలో విజయం సాధించడం అల్లు అర్జున్ కి బాగా కలిసొచ్చింది.

ఆయన పాన్ ఇండియా ఇమేజ్ కి దగ్గరయ్యారు. ఇక బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం అల్లు అర్జున్ తో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.అల్లు అర్జున్ మేనియా దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుష్ప చిత్రం అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప(Pushpa) పేరున అనేక మీమ్స్, స్పూఫ్స్ పుట్టుకొచ్చాయి. ఇదంతా పుష్ప మూవీకున్న జనాల్లో ఉన్న క్రేజ్ గా అర్థం చేసుకోవాలి. కాగా పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజం అనుకరిస్తూ కొందరు క్రికెటర్లు వీడియోలు చేశారు. సదరు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, బ్రావో, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్స్ పుష్ప రాజ్ డైలాగ్స్ చెబుతూ వీడియోలు చేశారు
అలాగే బంగ్లాదేశ్ వేదికగా ప్రీమియర్ లీగ్ జరుగుతుండగా... క్రికెటర్స్ కొందరు వికెట్ తీసినప్పుడు, సిక్స్, ఫోర్ కొట్టినప్పుడు తగ్గేదేలే మేనరిజం చేసి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే క్రికెటర్స్ వీడియోలు చేయడం, మ్యాచ్ మధ్యలో పుష్ప రాజ్ మేనరిజం అనుకరించడం అంతా ప్రమోషన్స్ లో భాగమే అంటున్నారు కొందరు. ఇదంతా డబ్బులిచ్చి చేయించిన ప్రచారం తప్పితే వాళ్లకు పుష్ప మూవీపై ఉన్న క్రేజ్ కాదంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది.
భారీ మొత్తంలో చెల్లించి పుష్ప ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి. పుష్ప మూవీపై హైప్ క్రియేట్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు తెలివిగా క్రికెటర్లకు డబ్బులు ఇచ్చి ఇలా ప్రమోట్ చేయించారని కొందరి వాదన. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్ తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో గడుపుతున్నారు. త్వరలో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనుంది. దీనితో ఆయన రిలాక్స్ అవుతున్నారు. పుష్ప పార్ట్ 2 కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది. మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.
దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కించారు. ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ డీగ్లామర్ లుక్ లో అదరగొట్టారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.