MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • OTTలో ఈవారం : కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

OTTలో ఈవారం : కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

గత మూడు రోజుల్లో ఎనిమిది కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యాయి. వీటిలో ఐదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తెలుగు వెబ్ సిరీస్, మరియు రెండు డబ్బింగ్ కంటెంట్ ఉన్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 25 2025, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
OTT, Rajakar, Srikakulam Sherlock Holmes

OTT, Rajakar, Srikakulam Sherlock Holmes


బిగ్ స్క్రీన్‪‌పై రిలీజయ్యే  సినిమాలకు ఎలా బజ్ ఉండి, జనాలు ఎదురుచూస్తారో అదే విధంగా ఓటిటి లో రిలీజ్ సినిమాలపైనా అదే స్దాయిలో అసక్తి ఉంటోంది.  హిట్, ఫ్లాప్ లకు సంభందం లేకుండా ఓటిటిలలో సినిమాలు చూస్తూంటారు. కాబట్టి ఏ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతున్నాయనే లిస్ట్ తప్పనిసరి అవుతోంది.    గత మూడు రోజుల్లో (జనవరి 22, 23, 24) ఎనిమిది సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఐదు తెలుగు స్ట్రైట్ సినిమాలు, ఒక తెలుగు వెబ్ సిరీస్, మరో రెండు డబ్బింగ్ కంటెంట్ ఉన్నాయి. ఇవి ప్రతీ ఒక్కటీ విభిన్న జోనర్‌లో ఉండటంతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23


రజాకార్ (Razakar)

తెలంగాణలో రజాకార్ ఆక్రమాలు, ఆపరేషన్ పోలో వంటి చారిత్రక అంశాల ఆధారంగా రూపొందిన ”రజాకార్” చిత్రం జనవరి 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం హిస్టారికల్ కాన్సెప్ట్‌ను ఇష్టపడే వారికి బాగా నచ్చే అవకాశం ఉంది.

శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlock Holmes)

వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జనవరి 24 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘చంటబ్బాయ్ తాలూకా’ అనే క్యాప్షన్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

సివరపల్లి (Sivarapalli)

ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ తెలుగు రీమేక్ అయిన ”సివరపల్లి” జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. గ్రామీణ జీవితంలోని సామాజిక అంశాలను సున్నితంగా చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

హిసాబ్ బరాబర్ (Hisab Barabar)

”మాధవన్” ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ”హిసాబ్ బరాబర్” జనవరి 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ స్కామ్‌ల నేపథ్యంలో నడిచే ఈ కథ అందరికి ఆసక్తికరంగా అనిపిస్తుంది.
 

33


హైడ్ అండ్ సీక్ (Hide and seek)

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ”హైడ్ అండ్ సీక్” ఇటీవల సన్ నెక్ట్స్‌లో విడుదలైంది. ఇది ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉంది. జనవరి 24 నుంచి ఈ మూవీ సన్ నెక్ట్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

వైఫ్ ఆఫ్ (Wife of)

80 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఎమోషనల్ థ్రిల్లర్ ”వైఫ్ ఆఫ్” జనవరి 23 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, ప్రతీకారం లాంటి ప్రధాన అంశాలతో ముందుకు సాగే ఈ థ్రిల్లర్ మంచి ఆదరణ అందుకుంటుంది.

బరోజ్ 3డీ (Barroz)

మలయాళ సూపర్ స్టార్ ”మోహన్ లాల్” ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ”బరోజ్ 3డీ” జనవరి 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసే మూవీలలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

ఫియర్ (Fear)

వేదిక ద్విపాత్రాభినయం చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ”ఫియర్” జనవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది.

ఈ ఎనిమిది కంటెంట్ ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా ఉండటంతో ఓటీటీలో ఈ వారం మంచి వినోదాన్ని అందించాయి. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved