కొత్త దంపతులతో మెగా హీరోలు.. అటు చరణ్, ఇటు చిరు మధ్యలో పవన్.. ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మెగా ఫోటోలు
వరుణ్ పెళ్ళిలో పవన్ కళ్యాణ్ అంతగా కనిపించలేదు. కానీ ఈ ఫొటోలో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి ఫోజు ఇచ్చారు. మెగా హీరోలంతా సాంప్రదాయ బట్టల్లో మెరిసిపోతుండగా పవన్ మాత్రం టీ షర్ట్ ధరించి ఉన్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి జంట బుధవారం రోజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు 'VarunLav' అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ పెళ్ళిలో సందడి చేశారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా కోలాహలంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లిలో డ్యాన్స్ చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.
మొదట నాగబాబు సోషల్ మీడియాలో కొత్త దంపతుల పెళ్లి ఫోటో షేర్ చేశారు. వరుణ్ తేజ్ కూడా పెళ్లి బట్టలో లావణ్యతో మెరిసిపోతున్న దృశ్యాలని పంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఒక్క పిక్ మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. నవ వధూవరులు వరుణ్ లావణ్య కూర్చుని ఉండగా వారి వెనుక మెగా హీరోలంతా నిలబడి ఉన్న ఫోటో మెగా ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది.
వరుణ్ పెళ్ళిలో పవన్ కళ్యాణ్ అంతగా కనిపించలేదు. కానీ ఈ ఫొటోలో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి ఫోజు ఇచ్చారు. మెగా హీరోలంతా సాంప్రదాయ బట్టల్లో మెరిసిపోతుండగా పవన్ మాత్రం టీ షర్ట్ ధరించి ఉన్నాడు. అటువైపు చరణ్.. ఇటువైపు చిరు ఉండగా మధ్యలో పవన్ ఉన్న దృశ్యాలు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ హ్యాపీ స్మైల్ తో అందంగా కనిపిస్తున్నారు. మొత్తంగా చాలా కాలం రహస్య ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య జంట ఇప్పుడు భార్య భర్తలుగా మారారు. కొత్త జీవితం ప్రారంభించారు.
మరో ఫొటోలో చిరు సురేఖ దంపతులు, పవన్.. అన్నా లెజినోవా.. నాగబాబు.. పద్మజ సతీసమేతంగా ఉన్నారు. చిరు చెల్లెల్లు కూడా వారి భర్తలతో కనిపిస్తున్నారు. ఈ పిక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.