- Home
- Entertainment
- పూరి జగన్నాధ్ అవుట్ డేటెడ్ డైరెక్టర్, నెటిజన్ల కామెంట్స్ కి హీరో దిమ్మతిరిగే రిప్లై
పూరి జగన్నాధ్ అవుట్ డేటెడ్ డైరెక్టర్, నెటిజన్ల కామెంట్స్ కి హీరో దిమ్మతిరిగే రిప్లై
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వరుస ఫ్లాపుల తర్వాత మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నారు. డబుల్ ఇస్మార్ట్, లైగర్ లాంటి భారీ ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసే హీరోలు కరువయ్యారు అంటూ రూమర్స్ వచ్చాయి.

Puri Jagannadh
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వరుస ఫ్లాపుల తర్వాత మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నారు. డబుల్ ఇస్మార్ట్, లైగర్ లాంటి భారీ ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసే హీరోలు కరువయ్యారు అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ పూరి జగన్నాధ్ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
vijay sethupathi
ఉగాది రోజు పూరి, విజయ్ సేతుపతి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ సేతుపతి తన విలక్షణ నటనతో భారీగా అభిమానులని సొంతం చేసుకున్నారు. హీరోగా నటిస్తూనే విలన్ గా కూడా చేస్తున్నారు. అలాంటి విజయ్ సేతుపతి ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాధ్ కి ఓకే చెప్పడంతో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
విజయ్ సేతుపతి కోరుకుంటే స్టార్ డైరెక్టర్లతో, సక్సెస్ ఉన్న దర్శకులతో సినిమాలు చేయొచ్చు. అవుట్ డేటెడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో ఎందుకు సినిమా చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పూరి జగన్నాధ్ గురించి చులకనగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లకు యువ హీరో శంతను భాగ్యరాజ్ దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారు. పూరి జగన్నాధ్ లాంటి సీనియర్ దర్శకులని గౌరవించడం నేర్చుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారిని అవుట్ డేటెడ్ అంటూ అవమానకరంగా మాట్లాడకండి.
shanthanu bhagyaraj
పూరి జగన్నాధ్ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆయన నిర్మాత కూడా. అలాంటి వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడ వద్దు అని శంతను చురకలు అంటించారు. శంతను హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. శంతను ఎవరో కాదు.. ప్రసిద్ధ దర్శకుడు కె భాగ్యరాజ్ తనయుడే.