- Home
- Entertainment
- శంకర్ అవుట్ డేటెడ్, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది.. నెటిజన్ కి కృష్ణ వంశీ మైండ్ బ్లోయింగ్ కౌంటర్
శంకర్ అవుట్ డేటెడ్, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది.. నెటిజన్ కి కృష్ణ వంశీ మైండ్ బ్లోయింగ్ కౌంటర్
కృష్ణవంశీ రాంచరణ్ తో గతంలో గోవిందుడు అందరివాడేలే అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఓ నెటిజన్ మీరు గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా అని ప్రశ్నించాడు.

క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణ వంశీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. స్టార్ హీరోలు సైతం గౌరవించే దర్శకుడు ఆయన. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా త్వరలో మురారి చిత్రం రి రిలీజ్ అవుతోంది. దీనితో మురారి చిత్రం సోషల్ మీడియాలో పెద్ద హంగామానే సృష్టిస్తోంది.
కృష్ణవంశీ కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ మురారి విశేషాలని పంచుకుంటున్నారు. మురారి చిత్రం గురించి ఫ్యాన్స్ కి అనేక విషయాలు చెబుతున్నారు. ఐ=ఇతర చిత్రాలు హీరోల గురించి కూడా కృష్ణ వంశీ కామెంట్స్ చేస్తున్నారు.
రాంచరణ్ కోసం స్క్రిప్ట్ ఐడియా ఉంది. చరణ్ టైం ఇస్తే వెంటనే చిత్రాన్ని పూర్తి చేస్తాను అని కృష్ణ వంశీ తెలిపారు. కృష్ణవంశీ రాంచరణ్ తో గతంలో గోవిందుడు అందరివాడేలే అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది.
Game Changer 2
ఓ నెటిజన్ మీరు గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా అని ప్రశ్నించాడు. దీనికి కృష్ణవంశీ సమాధానం ఇస్తూ చరణ్ నా బిడ్డలాంటివాడు. గేమ్ ఛేంజర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
దీనికి కొనసాగింపుగా మరో నెటిజన్ ఘాటుగా బదులిచ్చాడు. జరగండి జరగండి సాంగ్ విన్న తర్వాత గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది అనిపిస్తోంది అని నెటిజన్ అన్నారు. నెగిటివిటి వద్దు. సినిమా తప్పకుండా బావుంటుంది అని కృష్ణ వంశీ కౌంటర్ ఇచ్చారు.
నెటిజన్లు అంతటితో ఆగలేదు. శంకర్ అవుట్ డేటెడ్.. ఆయన పనైపోయింది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది అని మరో నెటిజన్ అన్నారు. అలా మాట్లాడడం తప్పు. శంకర్ గొప్ప విజన్ ఉన్న దర్శకుడు. ఒక పాట చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు అని కృష్ణవంశీ ధీటుగా నెటిజన్లకు బదులిచ్చారు.