- Home
- Entertainment
- హాట్ ఫోటోషూట్ చేయరా? నెటిజన్ ప్రశ్నకి విద్యాబాలన్ అదిరిపోయే ఆన్సర్.. ఏజ్ అడిగినందుకు ఏం చెప్పిందంటే?
హాట్ ఫోటోషూట్ చేయరా? నెటిజన్ ప్రశ్నకి విద్యాబాలన్ అదిరిపోయే ఆన్సర్.. ఏజ్ అడిగినందుకు ఏం చెప్పిందంటే?
విద్యాబాలన్ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటి. బొద్దుగా ఉన్నా విలక్షణ పాత్రలతో అలరిస్తున్న విద్యాబాలన్‌కి నెటిజన్ల నుంచి షాకిచ్చే ప్రశ్నలు ఎదురయ్యారు. వాటికి ఆమె చెప్పిన ఆన్సర్ సైతం ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.

విద్యాబాలన్(Vidhya Balan) కమర్షియల్ హీరయిన్‌గా చేయకపోయినా, ఆమెలో కమర్షియల్ యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. కేవలం డ్యూయెట్లలో కనిపించలేకపోవచ్చు. కానీ అంతకంటే హాట్‌గా వెండితెరపై హీటు పుట్టించగలదు. తన భారీ అందాలతో ఆడియెన్స్ కి కనువిందు చేయగలదు. `డర్టీ పిక్చర్` చిత్రంలో ఆమె నట విశ్వరూపం, అందాల విస్పోటనం గురించి అందరికి తెలిసిందే. అప్పట్లో ఘాటెక్కించే ఫోటో షూట్లతోనూ కనువిందు చేసింది విద్యా బాలన్.
అయితే ఈ మధ్య కాలంలో ఆ స్థాయిలో అందాలు ఆరబోయడం లేదు. కాస్త పొదుపుగానే ఆమె అలరిస్తుంది. అయితే అభిమానులు ఆమెని ఇదే విషయంపై ప్రశ్నించారు. తాజాగా విద్యాబాలన్ తన అభిమానులు, నెటిజన్లతో లైవ్ చాట్ చేసింది. ఇందులో అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగా ఆమెకి ఓ ఆశ్చర్యపరిచే ప్రశ్న వచ్చింది. మీరు ఎందుకు హాట్ ఫోటో షూట్‌చేయరు అంటూ ప్రశ్నించారా? నెటిజన్.
దీనికి ఆమె స్పందించింది. ఇప్పుడు వాతావరణం వేడిగానే ఉందని, ప్రస్తుతం షూటింగ్‌లతోనే బిజీగా ఉన్నానని, ఇది హాట్ ఫోటో షూట్ కాదా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వేడిలో షూట్ చేయడాన్ని ఆమె సెటైరికల్‌గా హాట్ ఫోటో షూట్‌గా తెలిపింది. తెలివిగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది విద్యా బాలన్. అయితే ఆమె అదే సమయంలో పలు హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడం విశేషం. ఈ ఫోటోలనుచూసిన నెటిజన్లు ఫైరింగ్ ఏమోజీలనుపంచుకోవడం విశేషం.
మరోవైపు తనకిష్టమైన ఫుడ్ ఏంటో చెప్పింది విద్యా. తాను ఇటాలియన్ ఫుడ్‌ని ఇష్టపడతానని తెలిపింది. అలాగే ఇష్టమైన ఐపీఎల్ టీమ్ ముంబయి ఇండియన్ అని వెల్లడించింది. నచ్చిన యోగాసనం `శవాసనం` అని పేర్కొంది. శవాసనం ఫోటోని సైతం పంచుకుంది. అలాగే ఇష్టమైన పుస్తకం `ది ఆల్కెమిస్ట్` అని పేర్కొంది. ఇష్టమైన డ్రెస్ శారీ అని తెలిపింది.
ఈ సందర్భంగానే ఓ నెటిజన్ మీ ఏజ్ ఎంత అని అడిగాడు. అందుకు విద్యాబాలన్ రియాక్ట్ అయిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఆ నెటిజన్ కి గూగుల్ సెర్చింగ్‌ని పంపించడం విశేషం. తన ఏజ్‌ని గూగుల్‌లో వెతుక్కోమని తెలిపింది. విద్యా ఇచ్చిన కౌంటర్‌కి సదరు నెటిజన్‌కి మతిపోయినట్టయ్యింది. ఈ ప్రశ్నలు, తన జవాబులను ఇన్‌స్టా స్టోరీస్‌లో విద్యాబాలను పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న విద్యాబాలన్ ఇటీవల `శకుంతలం దేవి`, `షేర్ని` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఆమె `జల్సా` అనే సినిమాలో నటించింది. ఇది మార్చి 18న ఓటీటీ విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె బిజీగా ఉంది. ఆ సందర్భంగానే అభిమానులతో చాట్‌చేసింది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది విద్యాబాలన్. ఇదిలాఉంటే ఆమె `ఎన్టీఆర్` బయోపిక్ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా బసవతారకం పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.