Nayanthara: శుభమా అని పెళ్లి చేసుకుంటే ఇదెక్కడి గొడవ నయనతార.. అప్పుడే నోటీసులు..
స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ గత నెలలో వైభవంగా జరిగిన వివాహంలో ఒక్కటయ్యారు. సౌత్ లో అగ్ర నటిగా వెలుగొందుతున్న నయనతార, దర్శకుడిగా రాణిస్తున్న విగ్నేష్ ఏడేళ్లుగా సహజీవనం చేశారు. ఎట్టకేలకు దంపతులుగా ఒక్కటయ్యారు.

స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ గత నెలలో వైభవంగా జరిగిన వివాహంలో ఒక్కటయ్యారు. సౌత్ లో అగ్ర నటిగా వెలుగొందుతున్న నయనతార, దర్శకుడిగా రాణిస్తున్న విగ్నేష్ ఏడేళ్లుగా సహజీవనం చేశారు. ఎట్టకేలకు దంపతులుగా ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చిత్ర పరిశ్రమ నుంచి అతిరథమహారధులు హాజరయ్యారు.
శుభమా అని నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుంటే.. రెండు నెలలు కూడా గడవకముందే ఈ సెలెబ్రిటీ జంటకి చిక్కులు మొదలయ్యాయి. విగ్నేష్ శివన్, నయనతార తమ వివాహ వేడుక వీడియో టెలికాస్ట్ చేసే హక్కులని ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థకి భారీ ధరకి అమ్మేశారు. ఈ మేరకు ఓటిటి దిగ్గజంతో భారీ డీల్ జరిగింది.
నయనతార, విగ్నేష్ లకి నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ 25 కోట్లు చెల్లించి మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ చేసే డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఈ డీల్ రద్దయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వివాహం జరిగి నెల కూడా గడవక ముందే విగ్నేష్ శివన్ కీలకమైన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంలో నెట్ ఫ్లిక్ సంస్థ తీవ్ర అసంతృప్తితో ఉందట. ఒప్పందం రద్దు చేసుకోవడానికి కారణం.
ఈ వ్యవహారంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ లీగల్ గా ముందుకు వెళుతోంది. తాజాగా నయన్, విగ్నేష్ లకి నెట్ ఫ్లిక్స్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తమ డబ్బుని తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ నోటీసుల్లో పేర్కొంది. లేదంటే కోర్టుకు కూడా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ కొత్త జంట చిక్కుల్లో పడ్డారు. నయన్, విగ్నేష్ సంతోషంగా వివాహం చేసుకుంటే ఈ గొడవేంటి అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
నయన్ వివాహానికి నెట్ ఫ్లిక్స్ భారీగానే ఖర్చు చేసింది. పెళ్లిలో ఒక్కో ప్లేట్ భోజనంకి రూ 3500 నెట్ ఫ్లిక్స్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే హోటల్ బుకింగ్స్, మేకప్ ఆర్టిస్ట్ లు, సెక్యూరిటీ మొత్తం నెట్ ఫ్లిక్స్ సంస్థే చూసుకునట్లు తెలుస్తోంది.
పెళ్లి వీడియోని గౌతమ్ వాసుదేవ్ డైరెక్షన్ లో ఆయన టీం షూట్ చేశారు. పెళ్ళిలో నయన్ ధరించిన కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ తాజా వివాదం విషయంలో నయన్, విగ్నేష్ ఎలా ముందుకు వెళతారో చూడాలి.