MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను సౌందర్య టైపు కాదు, శ్రీదేవి స్థాయికి వెళతా..ఆ విషయంలో ఎలాంటి హద్దులు లేవు, నేహా శెట్టి కామెంట్స్

నేను సౌందర్య టైపు కాదు, శ్రీదేవి స్థాయికి వెళతా..ఆ విషయంలో ఎలాంటి హద్దులు లేవు, నేహా శెట్టి కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో యువతని ఎక్కువగా ఆకర్షిస్తున్న నటి నేహా శెట్టి. నాజూకు సొగసుతో ఆకట్టుకునే నేహా శెట్టి.. డీజే టిల్లు చిత్రంతో బంపర్ హిట్ అందుకుంది. ఆ మూవీలో గ్లామర్ మాత్రమే కాదు.. రొమాన్స్ తో కూడా యువతని ఆకట్టుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2024, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం టాలీవుడ్ లో యువతని ఎక్కువగా ఆకర్షిస్తున్న నటి నేహా శెట్టి. నాజూకు సొగసుతో ఆకట్టుకునే నేహా శెట్టి.. డీజే టిల్లు చిత్రంతో బంపర్ హిట్ అందుకుంది. ఆ మూవీలో గ్లామర్ మాత్రమే కాదు.. రొమాన్స్ తో కూడా యువతని ఆకట్టుకుంది. ఆ తర్వాత నేహా శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. 

26

బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నేహా శెట్టి ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం నిర్మాతలు నేహా శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ చిత్రంలో నేహా శెట్టి గెస్ట్ రోల్ లో మెరిసింది. ఇటీవల ఇంటర్వ్యూలో నేహా శెట్టి తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడింది. 

36

కొందరికి ఆశించకుండానే కొన్ని రోల్స్ వస్తాయి. కానీ కొన్ని పాత్రలో కొందరు నటుల వద్దకే వెళతాయి. వాళ్ళకి ఆ బ్రాండ్ ఉంటుంది. దివంగత నటి సౌందర్యకి ఇక బ్రాండ్ ఉండేది. ఆమెని పెర్ఫామెన్స్ కి ఆస్కారం ఉండే పాత్రలే వెతుక్కుని వెళ్ళేవి. ఒక రైన్ సాంగ్ లో గ్లామర్ గా కనిపించాలని ఆమెని ఎవరూ అడగరు. అలాంటి బ్రాండ్ ఆమెది. 

46

దీని గురించి యాంకర్ ప్రశ్నించగా.. అందుకే నేను సౌందర్య టైపు కాదు. శ్రీదేవి లాగా చేయాలని ఉంది. శ్రీదేవి స్థాయికి వెళ్లాలనేది నా కోరిక. ఆమె స్థాయికి ఫ్యూచర్ లో చేరుకుంటానేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. శ్రీదేవి చాలా యంగ్ ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె గ్లామర్ విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టుకోలేదు. 

56

నాకు కూడా గ్లామర్ విషయంలో, యాక్టింగ్ విషయంలో ఎలాంటి హద్దులు లేవు. ఎందుకు హద్దులు పెట్టుకోవాలి ?ఇండస్ట్రీలో కొందరు అనుకుంటుంటారు.. గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు అవే చేయాలి.. పెర్ఫార్మెన్స్ రోల్స్ చేసే వాళ్ళు అవి మాత్రమే చేయాలి అనుకుంటుంటారు. కానీ నేను అలా కాదు. 

66

రూల్స్ రంజన్ చిత్రంలో నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను. ఆ సాంగ్ ని డిసెంబర్ లో షూట్ చేశాం. టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. వణికించే చలి. అయినప్పటికీ నా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాను అంటూ నేహా శెట్టి తన డెడికేషన్ బయట పెట్టింది. ఆ సాంగ్ లో నేహా శెట్టి అందాలు అరబోయడంతో బాగా వైరల్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Recommended image2
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?
Recommended image3
Tollywood Editor: తీవ్ర విషాదం..గుండెపోటుతో టాలీవుడ్ ఎడిటర్ మృతి.. పవన్, రామ్ పోతినేని సినిమాలకు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved