- Home
- Entertainment
- Ranbir-Alia: కొత్త జంటకు కళ్ళు చెదిరే గిఫ్ట్, రణ్ బీర్-ఆలియాకు నీతూకపూర్ సర్ ప్రైజ్
Ranbir-Alia: కొత్త జంటకు కళ్ళు చెదిరే గిఫ్ట్, రణ్ బీర్-ఆలియాకు నీతూకపూర్ సర్ ప్రైజ్
రీసెంట్ గా పెళ్ళి చేసుకున్నారు బాలీవుడ్ లవ్ కపుల్స్ రణ్ బీర్- ఆలియా భట్. అయితే వీరి పెళ్ళికి బాలీవుడ్ నుంచి లక్షల విలువ చేసే బహుమతులు వచ్చాయట. అయితే వాటన్నింటికంటే రణ్ బీర్ తల్లి నీతూ కపూర్ భారీ గిప్ట్ తో ఈ జంటనుసర్ ప్రైజ్ చేసిందట. ఇంతకీ నీతూ ఏం గిఫ్ట్ ఇచ్చింది.

రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతూ.. రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్న ఈ జంట ఏప్రిల్ 14న మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కపూర్ ప్యామిలీ ఆచారాలను పాటిస్తూ.. కేవలం కుటుంబ సభ్యలు, కొద్ది మంది సన్నిహితులు,బంధువుల సమక్షంలో సీక్రెట్‌గా ఈజంట పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్ళికి బాగా దగ్గర వారు అయిన కరణ్ జోహార్ లాంటి వారు తప్పించి బాలీవుడ్ ప్రముఖులెవరు హాజరు కాలేదు. ఇక కరీనా కపూర్, సైఫ్ లాంటి స్టార్స్ ఇంటివారే కనుకున బాలీవుడ్ నుంచి బయట స్టార్స్ ఎవరూ ఈ పెళ్లికి రాలేదు, అయినప్పటికీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, సిద్దార్థ్ మల్హోత్రా, ఇతర స్టార్స్ ఖరీదైన బహుమతులు పంపించారు.
ఇక ఎంత మంది ఎన్ని బహుమతులు ఇచ్చినా.. సొంత వారు. తమకు ప్రాణం లాంటి వారు ఇచ్చే బహుమతిలో కిక్ ఉంటుంది. ఇక అలాంటి గిప్ట్ ఒకటి ఈ జంటకు అందింది. రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ తన కొడుకు-కొడలికి ఖరీదైన ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముచ్చటగా కాపురం చేసుకోవడం కోసం ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్‌లో అలియా-రణ్‌బీర్‌ల కోసం 6 బెడ్‌రూం ప్లాట్‌ను బహుకరించిందట నీతూ కపూర్.
ఆరు బెడ్ రూమ్స్ తో అద్బుతంమైన ఈ ఇంటికోసం నీతూ కపూర్ దాదాపు గా 26 కోట్ల రూపాయలు పెట్టినట్టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ టాక్. ఇక నుంచి వారు ఈ ప్లాట్ లోనే కొత్త కాపురం మొదలు పెట్టబోతున్నారంటూ టాక్ గట్టిగా వినిపిస్తుంది.
ఇక వీరి పెళ్లి సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ నుంచి చాల బహుమతులు అందాయి. అందులో రణ్‌బీర్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ భార్య, హీరోయిన్ కత్రినా కైఫ్ అలియాకు 14 లక్షల విలువ చేసే ప్లాటినం బ్రాస్‌లెట్‌ను కానుకగా పంపించగా.. రణ్ బీర్ మరో మాజీ ప్రేయసి దీపికా తన సొంత బ్రాండ్ చోపార్డ్ నుంచి ఈ కొత్త జంటకు 15 లక్షలు విలువ చేసే కపుల్ వాచ్ ఇచ్చిందట.
ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆలియాకు.9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇవ్వగా..హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అలియాకు 3 లక్షల వెరసి హ్యాండ్‌బ్యాగ్‌ను పెళ్లి కానుకగా పంపించాడట. అటు మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన బెస్ట్ ఫ్రెండ్ అలియాకు 4 లక్షల గూచీ హై హీల్ చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
వివాహం అనంతరం పనులతో దాదాపు నెల రోజుల వరకు బిజీగా ఉండబోతుంది అలియాభట్. హనీమూన్ ప్లాన్‌లోనూ ఉన్నారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్ రెండింటిని ఒకే సారి కంప్లీట్ చేసుకోబోతున్నారు. మరోవైపు ఇప్పటికే అలియాభట్ చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. ఓ వైపు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి `బ్రహ్మస్త్ర`లో నటిస్తుంది. ఇది విడుదలకు రెడీ అవుతుంది. Alia Bhatt Marriage.
వీళ్లే కాదు అర్జున్ కపూర్ తన స్నేహితుడు రణబీర్ కపూర్‌కు లక్షన్నర విలువ చేసే గూచీ జిప్పర్ జాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇలా బాలీవుడ్ నుంచి లక్షల విలువ చేసే భహుమతులు ఆలియా,రణ్ బీర్ పెళ్లికి అందాయి. ఇక వీరిద్దరు హనీమూన్ ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారట.