- Home
- Entertainment
- Prema Entha Madhuram: అందరికీ షాకిచ్చిన మాన్సీ ప్రవర్తన.. భార్య చెంప చెళ్లుమనిపించిన నీరజ్!
Prema Entha Madhuram: అందరికీ షాకిచ్చిన మాన్సీ ప్రవర్తన.. భార్య చెంప చెళ్లుమనిపించిన నీరజ్!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. బిజినెస్ లో నష్టపోయిన పర్వాలేదు కానీ తన మాటే నెగ్గాలి అనుకునే ఒక సైకో కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్య వాళ్లకీ గిఫ్ట్లు ఇస్తుంది అంజలి. మీరు, మీ బ్రదర్ కి పూర్తిగా విరుద్ధం అంటాడు నీరజ్. పూర్తిగా బిజినెస్ వాతావరణం లో పెరగటం వల్ల ప్రతిదీ కమర్షియల్ గా ఆలోచిస్తాడు చూడండి ఇంత జరిగాక కూడా ఎంత హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడో అంటుంది అంజలి. మరోవైపు బయలుదేరుతున్న ఆర్యని భోజనం చేసి వెళ్ళమంటుంది అంజలి. లేదు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అంటాడు ఆర్య. ఈలోపు గెస్ట్లు రావడంతో నీరజ్ వాళ్ళని తీసుకొని అటువైపు వెళుతుంది అంజలి. నేను కూడా వచ్చేస్తాను అని అంజలి అంటే వద్దు నేను సైట్ లో వర్క్ చూసుకొని వస్తాను అప్పుడు ఇద్దరం కలిసి వెళ్లిపోదాము అంటాడు ఆర్య.
మరోవైపు పార్టీలో ఉన్నవాళ్లు మాన్సీని చూస్తూ ఏదో గొడవ పెట్టుకుని బావగారిని తోటి కోడల్ని బయటికి గెంటేసి బిజినెస్ మొత్తాన్ని చేతిలోకి తీసుకుందట. బాగా గయ్యాళి అంట చూస్తేనే తెలుస్తుంది కన్నింగ్ ఫెలో అని అంటూ మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న మాన్సీ కోపంతో రగిలిపోతూ ఓవర్ గా డ్రింక్ చేస్తుంది. మత్తులో వెళ్లి అనుకి డాష్ ఇస్తుంది. తిరిగి తనే నాకే డాష్ ఇస్తావా అంటూ అనుని చెంప మీద కొడుతుంది. అది చూసిన అంజలి, మాన్సీ చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా నీకు ఎంత ధైర్యం అంటూ కేకలు వేస్తుంది మాన్సీ.
కడుపుతో ఉందని కూడా చూడకుండా అప్పుని కొడతావా నీకు మేనర్స్ ఉందా అంటూ అంజలి కేకలు వేస్తుంది. చాలా ఓవర్ చేస్తున్నావు ఇంకాపు అంటూ నీరజ్ కూడా మాన్సీని మందలిస్తాడు. ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు ఒక పని మనిషి కోసం నీ బిజినెస్ పార్టనర్ ని నన్నే కొడతావా నా దయ వల్లే నీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది అంటుంది మాన్సీ. నా కంపెనీ క్యాపబిలిటీని బట్టి కాంట్రాక్టు వచ్చింది అంతేగాని నీ దయవల్ల కాదు అంటుంది అంజలి.
నీరజ్ కూడా మాన్సీని నోరు అదుపులో పెట్టుకోమంటూ మందలిస్తాడు చేసింది చాలు ఇక్కడి నుంచి వెళ్దాం పద అంటూ అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు నీరజ్. ఇదంతా నావల్లే జరిగింది సారీ, అయినా తనకి ఏమైంది అంత రూడ్ గా ఎందుకు మాట్లాడుతుంది అంటుంది అంజలి. తను కాన్షియస్ లో లేదు అంటుంది అను. నాకు చాలా బాధగా ఉంది అని అంజలి అంటే పర్వాలేదు మేడం దీన్ని ఇక్కడితో వదిలేయండి మీరు ఎంజాయ్ చేయండి నేను బయలుదేరుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను. మరోవైపు మాన్సీని ఇంటికి తీసుకువస్తాడు నీరజ్. ఆ అంజలి నన్ను కొట్టింది దాని అంతు చూడాలి ఎందుకు నన్ను తీసుకువచ్చేసావు అంటూ హడావిడి చేస్తుంది మాన్సీ.
అంతలోనే అక్కడికి శారదమ్మ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. తప్ప తాగి వదినమ్మ ని కొట్టి ఇన్సెల్ట్ చేసింది అందుకు అంజలి సరియైన బుద్ధి చెప్పింది అంటూ జరిగిందంతా చెప్తాడు నీరజ్. నేను నీ భార్యని నువ్వు నాకే సపోర్ట్ చేయాలి తనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని అడుగుతుంది మాన్సీ. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకా మాట్లాడితే నేను చెయ్యి చేసుకోవలసి వస్తుంది అంటాడు నీరజ్. నువ్వే కొట్టగలవా నేను కూడా కొడతాను అంటుంది మాన్సీ. ఏం మాట్లాడుతున్నావ్ అతను నీ భర్త అంటూ మందలిస్తుంది శారదమ్మ.
అయితే ఏంటి తాగి వచ్చి పెళ్ళాలని కొట్టవచ్చు కానీ మేము తాగిన వచ్చి మొగుళ్ళని కొట్టకూడదా అయినా మొగుడు అనే హోదా నేను ఇచ్చిందే కదా లేకపోతే అన్న ముందు చేతులు కట్టుకొని బానిసలాగా బ్రతికేవాడు. అసలు నిన్ను ఇలాగా పెంచినందుకు మీ అన్నని అనాలి అంటూ ఆర్య ని నానా మాటలు అంటుంది. ఇక ఆ మాటలు భరించలేక మాన్సీ చెంప పగలగొడతాడు నీరజ్. నన్నే కొడతావా అంటూ ఏవేవో మాట్లాడుతూ అలాగే మత్తులోకి వెళ్ళిపోతుంది మాన్సీ. ఒక ఉప్పు కణిక పాలన్నీ విరిచేసినట్లు నీ ఒక్కదానివల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది అంటూ బాధపడుతుంది శారదమ్మ.
మరోవైపు ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అను. ఎంతకు రాకపోవడంతో కడుపులో ఉన్న బిడ్డతో ఆర్య మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది అను. అప్పుడే వచ్చిన ఆర్య అదంతా వింటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.