- Home
- Entertainment
- పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. 'గే' వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలని సలహా
పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. 'గే' వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలని సలహా
నీనా గుప్తా టీవీ, బాలీవుడ్‌లో ప్రముఖ నటి. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు అవివాహిత తల్లి కావాలని నిర్ణయించుకున్న మొదటి బాలీవుడ్ నటి ఆమె. ఒకసారి నీనాకు 'గే' వ్యక్తిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు.

1980లలో నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో ప్రేమలో ఉన్నప్పుడు, ఆమె గర్భవతి అయ్యింది. పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.
వివియన్ రిచర్డ్స్ ఇప్పటికే వివాహం చేసుకున్నందున నీనాను పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇది నీనాకు కష్టకాలంగా మారింది. తనకు ఏంచేయాలో అర్థం కాలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో నీనా గుప్తాకి ఏంచేయాలో తోచలేదు. అయితే ఆమె స్నేహితుడు ఒకరు క్రేజీ సలహా ఇచ్చారట. 'గే' వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పినట్టు వెల్లడించింది నీనా గుప్తా.
నీనా స్నేహితుడు సుజోయ్ మిత్రా.. ఒక గే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోమని, మసాబా తన కూతురని చెప్పవచ్చని సలహా ఇచ్చాడని ఆమె తెలిపింది.
`వివాదాలను నివారించడానికి పెళ్లి చేసుకోవడం సరైనది కాదని నాకు అనిపించింది` అని నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
`ప్రజల దృష్టిలో ఉండటం వల్ల నా జీవితం, నా బిడ్డ జీవితం ఎప్పుడూ ఊహాగానాలతో నిండి ఉంటుందని నీనా తెలిపింది.
నీనా గుప్తాకు బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ నుంచి పెళ్లి ప్రతిపాదన కూడా వచ్చిందట. ఈ విషయాన్ని కూడా ఆమె చెప్పడం విశేషం.
1989 నవంబర్ 2న నీనా గుప్తా 30 ఏళ్ల వయసులో మసాబా గుప్తాకు జన్మనిచ్చింది. మసాబా ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.