- Home
- Entertainment
- Nayanthara weds Vignesh: నయనతార పెళ్లి పనులు షురూ.. మొదటి పెళ్లి పత్రిక ఎవరికి ఇచ్చారో తెలుసా..?
Nayanthara weds Vignesh: నయనతార పెళ్లి పనులు షురూ.. మొదటి పెళ్లి పత్రిక ఎవరికి ఇచ్చారో తెలుసా..?
ఈమధ్య సినీ తారల పెళ్ళిళ్లు వరుసగా జరుగుతున్నాయి. త్వరలో స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక పెళ్ళి పనులు షూరూ అయ్యాయి.

కోలీవుడ్ లో పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. ఎట్టకేలకు పెళ్ళి బంధంతో ఒకటి కాబోతున్నారు నయనతార, విఘ్నేష్ శివన్. త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న జంట ఇంట ఇప్పటికే పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యాయి.
జూన్ 9న వీరి పెళ్లి జరగబోతోంది. పెళ్లి కి టైమ్ దగ్గర పడుతుండటంతో.. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు ఈ జంట. పెళ్లి ఏర్పాట్లు దగ్గర ఉండి వారు స్వయంగా చేసుకుంటున్నారు. దాంతో కోలీవుడ్ లో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది.
ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తిరుమలలో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి చేసుకోబోయే కల్యాణమంటపాన్ని కూడా ఈ జంట పరిశీలించారు.
తాజాగా వీరిద్దరూ తమ కులదైవం ఆలయానికి వెళ్లారు. చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లిన వీరు... అక్కడి నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్లి అక్కడ ఉన్న కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నయన్, విఘ్నేష్ ల పెళ్ళి పత్రికుల రెడీ అయ్యాయి. తమ కులదైవం పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను వారు పెట్టినట్టు సమాచారం. జూన్ 9వ తేదీన వీరి పెళ్ళి జరగబోతోంది. . మరోవైపు పెళ్లి కారణంగా నయనతార ఏ సినిమాలోనూ నటించడం లేదు
వీరి పెళ్లి ఎప్పుడో జరగాల్సింది.. కొన్నిళ్లు సినిమాల వల్ల వాయిదా పడిన వివాహం... ఆతరువాత కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లవ్ లో పడిన దగ్గర నుంచి చెట్టాపట్టాలు వేసుకుని.. గట్టిగానే తిరిగారు నయన్, విఘ్నేష్ లు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్ళారు. ఇక విదేశీ టూర్లు అయితే లెక్కే లేదు.
గతంలో రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ ఫేస్ చేసింది నయనతార. శింబుతో పీకల్లోతు ప్రేమలో పడ్డ నయన్.. దాదాపు పెళ్ళి పీటల దాకా వచ్చిన తరువాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆతరువా ప్రభుదేవతో తిరిగిన బ్యూటీ.. ఆతరువాత జరిగిన గొడవల వల్ల ఆయనకు దూరం అయ్యింది. ఫైనల్ గా తనకంటే చిన్నవాడైన యంగ్ డైరెక్టర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది బ్యూటీ.