- Home
- Entertainment
- తాను ఫిల్మ్ కిడ్‌ని కాదు.. గతాన్ని తలుచుకుంటూ నయనతార ఎమోషనల్.. వెడ్డింగ్ టీజర్ ఔట్.. అంతకు మించి
తాను ఫిల్మ్ కిడ్‌ని కాదు.. గతాన్ని తలుచుకుంటూ నయనతార ఎమోషనల్.. వెడ్డింగ్ టీజర్ ఔట్.. అంతకు మించి
లేడీ సూపర్‌స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ టీజర్ విడుదలైంది. కేవలం మ్యారేజ్‌కి సంబంధించినదే కాదు, ఇందులో వారి కెరీర్, స్ట్రగుల్స్, తెరవెనక జీవితాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు.

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జూన్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. అయితే అత్యంత క్రేజ్, పాపులారిటీ ఉన్న జంట కావడంతో వీరి పెళ్లికి ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా బిగ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇదంతా సాధారణ జనాలకు ఆసక్తికరమైన అంశం. అభిమానులకు కనువిందు చేసే అంశం.
దీంతో పెళ్లి వేడుక వీడియో హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. దీనికోసం ఏకంగా రూ. 25కోట్లు చెల్లించింది. త్వరలో దీన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా టీజర్ విడుదలైంది. `నయనతారః బియాండ్ ది ఫెయిరీ టేల్` పేరుతో రూపొందించిన ఈ వెడ్డింగ్ వీడియో టీజర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో మ్యారేజ్‌కి సంబంధించే కాదు, అంతకు మించిన అంశాలున్నాయి. నయనతార హీరోయిన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చింది, తన గతం ఏంటి? విఘ్నేష్ శివన్‌తో లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందనే అంశాలను ఇందులో చూపించారు. టీజర్‌లో `నయనతారే ఎందుకు? అని విఘ్నేష్‌ని ప్రశ్నించగా, `ఏంజెలినా జోలీ కూడా అడిగింది. కానీ ఆమె సౌత్ ఇండియన్ కాదు, ఆమె హీరోయిన్‌గా కంటే అద్భుతమైన మనిషి` అని విఘ్నేష్ చెప్పారు.
నయనతార చెబుతూ, లేడీ సూపర్ స్టార్‌గా గురించి మాట్లాడుతూ, `ట్యాగ్స్, టైటిల్స్ అనేవి తనకు అర్థం కావని, తాను ఫిల్మ్ కిడ్‌ని కాదని చెబుతుంది. అందరిలాంటి ఒక మామూలు అమ్మాయిని అని, సినిమా అంటే ప్యాషన్ అని, పిచ్చిగా చేసుకుంటూ వచ్చినట్టుగా నయతార ఇందులో చెప్పినట్టుంది. ఇదిలా ఉంటే ఈ వెడ్డింగ్ డాక్యుమెంటరీ వీడియోకి దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడం విశేషం. ఇది పెళ్లి సినిమా కాదని, లేడీ సూపర్ స్టార్‌పై డాక్యుమెంటరీ అతని తెలిపారు.
`వారి పెళ్లి సినిమాకి నేను దర్శకత్వం వహిస్తున్నానని మొదట్లో చాలా మంది అనుకున్నారు. కానీ అది నెట్ ఫ్లిక్స్ కోసం తీసిన డాక్యుమెంటరీ. అది నయనతార గురించి చెబుతుంది. ఆమె చిన్ననాటి ప్రయాణం నుండి ఇప్పటి వరకు ప్రతిదీ మేము ఇందులో చూపించబోతున్నాం. చిన్ననాటి ఫోటోలు, అలాగే ఆమెకి సంబంధించిన పలు మధుర క్షణాలను కూడా చూపిస్తున్నాం` అని చెప్పారు గౌతమ్ మీనన్.
నయనతార ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన `కాతు వాకుల రెండు కాదల్` చిత్రంలో నటించింది. సమంత మరో హీరోయిన్. ఈ చిత్రం డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం నయన్ `గోల్డ్`, `గాడ్ ఫాదర్`, `జవాన్`, `కనెక్ట్`, `ఇరైవన్` చిత్రంలో నటిస్తుంది.