గ్రాండ్ గా నయనతార 'అమ్మోరు తల్లి 2' పూజా కార్యక్రమం, ఏకంగా 100 కోట్ల బడ్జెట్
సుందర్ సి దర్శకత్వంలో నయనతార నటిస్తున్న 'అమ్మోరు తల్లి 2 (మూకుత్తి అమ్మన్ 2)' సినిమా పూజ చెన్నైలో ఇవాళ గ్రాండ్‌గా జరిగింది.

Nayanthara
Nayanthara's Mookuthi Amman 2 Pooja : మూకుత్తి అమ్మన్ (అమ్మోరు తల్లి 2) సినిమా రెండో భాగం షూటింగ్ ఇవాళ పూజతో మొదలైంది. నయనతారతో పాటు సినిమా టీమ్ అంతా హాజరయ్యారు.
ఆర్.జే. బాలాజీ డైరెక్షన్‌లో నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్' 2020లో ఓటీటీలో రిలీజైంది. వేల్స్ ఫిల్మ్స్ దీన్ని నిర్మించింది. ఇందులో అమ్మన్ పాత్రలో నయనతార నటించింది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో భాగాన్ని గ్రాండ్‌గా తీయాలని ఐసరి గణేష్ ఫిక్స్ అయ్యారు. 'మూకుత్తి అమ్మన్ 2' బాధ్యతల్ని డైరెక్టర్ సుందర్ సికి అప్పగించారు.
నయనతార
'మూకుత్తి అమ్మన్ 2' దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రెడీ అవుతోంది. సినిమా షూటింగ్ ఇవాళ పూజతో స్టార్ట్ అయింది. దీనికోసం గుడిలాంటి సెట్ వేశారు. డైరెక్టర్ సుందర్ సి, ప్రొడ్యూసర్ ఐసరి గణేష్ చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. హీరోయిన్ నయనతార లేటుగా వచ్చినా మాస్‌గా ఎంట్రీ ఇచ్చింది.
మూకుత్తి అమ్మన్ 2 నటీనటులు
ఈ ఈవెంట్‌లో సుందర్ సి మాట్లాడుతూ సినిమాలో నటించే మిగతా నటీనటుల్ని స్టేజ్‌పై పరిచయం చేశారు. రెజీనా కసెండ్రా, ఇనియా, యోగిబాబు, సింగం పులి, విచ్చు విశ్వనాథ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ సినిమాలో ఉన్నారని సుందర్ సి చెప్పారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నారని తెలిపారు. ముందుగా ఈ విలన్ పాత్రలో అరుణ్ విజయ్ నటిస్తారని అనుకున్నారు. కానీ శాలరీ విషయంలో సెట్ కాకపోవడంతో దునియా విజయ్‌ని తీసుకున్నారు.
మూకుత్తి అమ్మన్ పూజలో నయనతార
ఇంకా ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ ఆది మ్యూజిక్ అందిస్తున్నారట. 'మూకుత్తి అమ్మన్' ఫస్ట్ పార్ట్‌లో నటించేటప్పుడు నయనతార ఉపవాసం ఉంది నటించింది. ఈ సినిమాకు కూడా అలాగే ఉపవాసం ఉండి నటిస్తారట. సినిమాకు పూజ చేసిన వారం ముందు నుంచే తన పిల్లలతో కలిసి నయనతార ఉపవాసం స్టార్ట్ చేసిందని ప్రొడ్యూసర్ ఐసరి గణేష్ చెప్పారు.
ఈ సినిమా పూజలో ఫస్ట్ సీన్ కూడా తీశారు. నయనతార మూకుత్తి అమ్మన్‌ను దర్శనం చేసుకునే సీన్‌ను డైరెక్టర్ సుందర్ సి షూట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతుందట. ఐసరి గణేష్ వేల్స్ ఫిల్మ్స్‌తో కలిసి నయనతార రౌడీ పిక్చర్స్, ఖుష్బూ సుందర్ సికి చెందిన అవని సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.