1 నిమిషానికి 5 కోట్లు.. ఫ్యూజ్ లు ఎగిరిపోయే రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు..? ఏసినిమాకు..?
హీరోయిన్లు కెరీర్ టైమ్ చాలా తక్కువగా ఉండేది. రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగా తీసుకునేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కోట్లకుకోట్లు తీసుకుంటున్నారు. 40 ఏళ్ళు దాటిన హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. నిమిషానికి 5 కోట్లు తీసుకునే హీరోయిన్ ఎవరో తెలుసా..?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే వెంటనే వెలుగు వెలుగుతుంది నయనతార. మలయాళీ అయినా ఈమె..అక్కడ సాధారణ టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి నయనతార.. సౌత్ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సాధించింది.
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఎంత ఏజ్ వస్తుంటే.. అంత గ్లామర్ గా తయారవుతుంది సీనియర్ బ్యూటీ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఏమాత్రం వన్నె తగ్గని ఈ తార.. వరుస ఆఫర్లు సాధిస్తూ.. రెమ్యునరేషన్ ను కూడా రెట్టింపు చేస్తోంది. ఒక వైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్ లు.. ఇంకో వైపు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తోంది.
Nayanthara
ఇక నయనతార సంపాదన మామూలుగా లేదు. ఇతర హీరోయిన్ల కంటే డబుల్ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పలికే సినిమాకు ఆమె రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు సినిమాను బట్టి డిమాండ్ చేస్తుందట. ఇక వాటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమె గట్టిగానే రెమ్యునరేషన్ లాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ కు సబంధించి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది.
Actor Nayanthara ott documentary trailer out
ఇప్పటికే చాలా బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన నయనతార రీసెంట్ గా టాటా స్కై కి సబంధించిన యాడ్ ను చేశారట. అయితే దాదాపు 50 సెకండ్ల వరకూ ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ చార్జ్ చేశారట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నయన్ కు అంత డిమాండ్ ఏంటీ.. ఎందు అంతలా ఆమె వెనకు పడుతున్నారంటూ షాక్ అవుతున్నారు
Nayanthara
సూపర స్టార్ నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది. ఈసినిమాతో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోంది నయన్. ఈరెండు సినిమాల షూటింగ్ బిజీల్ ఉంది సీనియర్ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే.. ఆమెకు మరో సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది ఎవరి సినిమానో కాదు.. కన్నడ రాక్ స్టార్ యష్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
సాధారణంగా నయనతార సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేది. కాని టాక్సిక్ సినిమా కోసం ఆమె గట్టిగా డిమాండ్ చేసిందట. ఈసినిమాో యష్ సోదరిగా నయన్ నటిస్తోందంటూ న్యూస్. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..ఈ పాత్రలో నటించేందుకు ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని