దేవుడు తథాస్తు అన్నాడేమో.. షారుఖ్ పై నయనతార కామెంట్స్ వైరల్..
షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'జవాన్' మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది. తాజాగా షారుఖ్ ఖాన్ తో నటించడంపై స్పందించింది నయన్.
Nayanthara
హీరోయిన్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది బ్యూటీ. హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.. అది దాటితే.. 35 వరకూ నెట్టుకుని వచ్చేవారు ఉన్నారు. కాని 40 ఏళ్ళు వస్తున్నా.. హీరోయిన్ గా అదే డిమాండ్ తో దూసుకుపోతోంది నయనతార.
ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవడంతో పాటు.. బ్లాస్టింగ్ కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ఈసినిమాతో హిందీ ఆడియన్స్ అభిమానాన్ని కూడా సాధించింది నయన్. ఏజ్ పెరుగుతన్నా కొద్ది ఆమె క్రేజ్ కూడా పెరుగుతూ వస్తోంది.
షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'జవాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నయనతార. లేడీ సూపర్ స్టార్ అటు బాలీవుడ్ ఆడియన్స్ మనసులు కూడా దోచేసింది. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది
అయితే తాను ఈ సినిమాలో నటించడంపైతాజాగా కామెంట్లు చేసింది బ్యూటీ.. నయనతార మీడియా ముందుకు రావడమే అరుదు. తాను నటించే ఏ సినిమా ప్రమోషన్లకు ఆమె వెళ్లదు. అంతే కాదు.. ఆకరికి షారుఖ్ లాంటి స్టార్ హీరో సినిమా.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నసినిమా అయినా.. సరే.. జవాన్ ప్రమోషన్లలో కూడా ఆమె హ్యాండిచ్చేశారు.
అయితే రీసెంట్ గా నయనతార చెన్నయ్‌లో అనుకోకుండా మీడియా కంట పడ్డారు. దొరక్క దొరక్క దొరకడంతో..నయనతార ను వదలకుండా ప్రశ్నలతో ముంచెత్తారు మీడియావారు.ఈ సందర్భంగా జవాన్ గురించి మాట్లాడారు నయన్. నేను చిన్నప్పటి నుంచి షారుఖ్ వీరాభిమానిని. దిల్‌వాలే దిల్హానియా లేజాయింగే ఓ యాభై సార్లు చూసుంటాను అన్నారు.
nayanthara
జీవితంలో షారుఖ్ ను డైరెక్టర్ గా చూస్తే చాలు అనుకున్న తనకు.. ఓసారి ఓ ఫంక్షన్‌లో ఆయన్ను కలిసే అవకాశం దొరికింది. అప్పుడు ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు. నిన్ను బాలీవుడ్‌కి తీసుకెళ్లిపోతా.. అంటూ అన్నారు. కాని అప్పుడు ఆయన సరదాగా అన్నారు అనుకున్నాను. కాని ఆటైమ్ లో పై నుంచి తథాస్తు దేవతలు తథాస్తు అన్నారేమో. ఇప్పుడు అది నిజం అయ్యింది అన్నారు నయన్.
అప్పుడు ఆయన చెప్పడం.. తాను షారుక్ సినిమాతోనే సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టా. బాలీవుడ్‌లో నా తొలి సినిమా ఇంత విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చారు నయన్. మరి బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతారా? అనడిగితే.. మంచి పాత్రలు వస్తే.. ఏ భాషలో అయినా నటించడానికి తాను రెడీ అంటూ చాలా సింపుల్ గా ఆన్సర్ చేశారు నయన్.