- Home
- Entertainment
- సాయి పల్లవి, అనుష్క, నయన్.. సినిమాల కోసం పేర్లు మార్చుకున్న హీరోయిన్లు వీళ్ళై... అసలు పేర్లు ఏంటంటే..?
సాయి పల్లవి, అనుష్క, నయన్.. సినిమాల కోసం పేర్లు మార్చుకున్న హీరోయిన్లు వీళ్ళై... అసలు పేర్లు ఏంటంటే..?
ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో చాలామంది పేర్లు ఒరిజినల్ కాదు. రకరకాల కారణాలు కావచ్చు.. కలిసిరావచ్చు అనేక కారణాలతో తమ పేర్లను మర్చుకుని.. స్క్రీన్ నేమ్స్ తో స్టార్ హీరోయిన్లు గా మారారు . నయనతార నుంచి సాయి పల్లవి వరకూ.. సెలబ్రిటీల అసలుపేర్లు ఏంటో తెలుసా..?

కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న నటి నయనతార. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు, ఒక మలయాళ దర్శకుడు ఆమె పేరును నయనతారగా మార్చాడు.
Anushka Shetty
నటి అనుష్క శెట్టి అసలు పేరు స్వీటి శెట్టి. ఇండస్ట్రీలో ఆమెకు బాగా కావల్సిన వారు చాలా మంది ఇప్పటికీ ఆమెను స్వీటీ అని పిలుస్తారు. స్క్రీన్ నేమ్ కోసం.. కింగ్ నాగార్జునతో పాటు.. మరికొందరు కలిసి ఆమె పేరును అనుష్కగా మార్చేశారు. అలా అనుష్క టాలీవుడ్ ను ఏలేసింది.
ఇక తమిళ సినిమాలతో బాగా ఫేమ్ అయిన తెలుగు పిల్ల అంజలి. ఆమె అసలు పేరు అంజలి కాదు.. బాలాత్రిపురసుందరి. సినిమాలో నటించేందుకు ఫ్యాన్సీ పేరు కావాలని ఆమె పేరును అంజలిగా మార్చుకుంది.
అచ్చ తెలుగు హీరోయిన్ రంభ. విజయవాడకు చెందిన ఈ నటి తమిళ చిత్రసీమను కూడా ఒకప్పుడు ఊపు ఊపి వదిలిపెట్టింది. ఇక ఈమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమా కోసం తన పేరును కూడా రంభగా మార్చుకున్నాడు. అలా మార్చుకోవడమే ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్మైల్ క్వీన్ గాపేరు సంపాధించుకుంది నటి స్నేహ. అయితే స్క్రీన్ మీద స్నేహాగా పిలవడుతున్న ఆమె అసలు పేరు మాత్రం అది కాదట. ఆమె పేరు సుహాసిని కాగా.. సినిమాల్లో మాత్రం స్నేహాగాపిలవపడుతుంది.
నటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ కూడా సినిమా కోసం తన పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు శృతి రాజలక్ష్మి హాసన్. దాన్ని కుదించి శృతి హాసన్‌గా మార్చాడు.
ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ బిజీ అయిన సాయి పల్లవి తన పేరు కూడా మార్చుకుంది. ఆయన అసలు పేరు సాయి పల్లవి సెంతామరై. ఇది చాలా పెద్దది మరియు అభిమానులు మనస్సులో ఉంచుకోలేరు కాబట్టి సాయి పల్లవిగా మార్చుకుందట.