- Home
- Entertainment
- నయనతార నుంచి కీర్తి సురేష్ వరకు.. కోట్లు కూడబెట్టిన సౌత్ టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే..
నయనతార నుంచి కీర్తి సురేష్ వరకు.. కోట్లు కూడబెట్టిన సౌత్ టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే..
ఇదివరకు ఏమో కాని.. ప్రస్తుతం మాత్రం కోట్లు కూడబెడుతున్నారు స్టార్ హీరోయిన్లు. ముఖ్యంగా బాలీవుడ్ తారకు పోటీ ఇస్తూ.. మన సౌత్ హీరోయిన్లు కోటీశ్వరులవుతున్నారు. 2024 వరకూ కోట్లు కూడబెట్టి.. వ్యాపారాలు చేస్తూ సెట్ అయిన సౌత్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంత కాలం హీరోయిన్లు ఉండరు. పెళ్లి, వయసు, అందం వంటి అనేక కారణాల వల్ల నటీమణులు ఫీల్డ్ నుంచి తప్పుకోవడం లేదా క్యారెక్టర్ రోల్స్ చేసుకొంటుంటారు. అక్క,చెల్లి, తల్లి వంటి సపోర్టింగ్ రోల్స్‌లో నటించడం మొదలుపెడతారు. అయితే కొందరు నటీమణులు మాత్రం హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఉదాహరణలు త్రిష, నయనతార వంటి నటీమణులు. సపోర్టింగ్ క్యారెక్టర్లే కాకుండా 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తోంది. ఇటీవల హీరోలతో పాటు హీరోయిన్లు కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దీంతో ఈ టాప్ హీరోయిన్ల ఆస్తి విలువ బాగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం కోట్లు కూడబెట్టిన టాప్ 10 సౌత్ ఇండియన్ నటీమణుల గురించి చూద్దాం.
సౌత్ ఇండియాలోనే అత్యంత సంపన్న నటి నయనతార. ఆమె ఆస్తులు మొత్తం దాదాపు 300 కోట్లుగా అంచనా వేయగా.. నయనతార చెన్నైతో పాటు, నయనతార హైదరాబాద్, కేరళ, ముంబై వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో 100 కోట్ల విలువైన 4 లగ్జరీ ఇళ్ళు మరియు 4 BHK ఇల్లు కూడా కలిగి ఉంది. నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల పైనే వస్తూలు చేస్తోంది.
సౌత్ ఇండియన్ టాప్ 10 రిచెస్ట్ నటీమణుల జాబితాలో నటి అనుష్క 2వ స్థానంలో నిలిచింది. తెలుగు, తమిళం భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన అనుష్క నికర విలువ రూ.133 కోట్లు ఉంటుందని సమాచారం. బాహుబలిలాంటి పాన్ ఇండియా సినిమాలు చేసిన ఆమె.. చాలాకాలం గ్యాప్ తరువాత.. రీసెంట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అనుష్క ప్రస్తుతం మలయాళ చిత్రం కత్నార్ – ది వైల్డ్ సోర్సెరర్‌లో నటిస్తోంది. అనుష్క ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటుంది.
దక్షిణ భారత సంపన్న నటీమణుల జాబితాలో నటి తమన్నా 3వ స్థానంలో నిలిచింది. తమన్నా ఒక సినిమా కోసం రూ. 1.5 నుంచి 5 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో అడపాదడపా నటిస్తోంది. ఎక్కువగా వెబ్ సిరీస్ ల పై కన్నేసింది బ్యూటీ. హిందీ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. తమన్నా నికర ఆస్తుల విలువ దాదాపుగా 130 కోట్లు ఉంటుందని అంచనా.
సౌత్ ఇండియాలోని అత్యంత సంపన్న నటీమణుల్లో నటి సమంత ఒకరు. సమంత ఒక్కో సినిమాకు ఆమె 8 కోట్ల వరకూ తీసుకుంటుందట. ఈమధ్య సినిమాలకు విరాపం ప్రకటించి సమంత కుషీ సినిమాతో సందడి చేసింది. ఆతరువాత ఆమెకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అంతే కాదు హీరోయిన్ గా మాత్రమే కాకుండా .. పలు యాడ్లు.. వ్యాపారాలు చేస్తుంది బ్యూటీ. అంతే కాదు వెబ్ సిరీస్ లతో సదడి చేసతుంది సమంత. సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ సిటాడెల్‌లో నటిస్తోంది. నటి సమంత నికర ఆస్తుల విలువ 100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
controversies related to heroine trisha krishnan
20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా నటిస్తున్న త్రిష.. కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ హీరోయిన్ గానే రీ ఎంట్రీ ఇచ్చింది. ఎట్టకేలకు విజయ్ సరసన లియో సినిమాలో నటించి మెప్పించి.. మళ్ళీ బిజీ అయ్యింది బ్యూటీ. ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో తలజోడీగా నటిస్తోంది. త్రిష మణిరత్నం-కమల్ హాసన్ టాక్ లైఫ్ లో కూడా నటిస్తోంది. త్రిష కూడా 6 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇకఈమె ఆస్తులు 90 కోట్లు ఉంటాయని అంచనా.
కొన్ని నివేదికల ప్రకారం, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటీమణులలో ఒకరైన కాజల్ అగర్వాల్ ఇప్పటికీ సినిమాకు రెండు నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. గత ఏడాది బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. తమిళంలో ఇండియన్ 2తో సహా. హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఆస్తుల విలువ దాదాపు 58 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
పూజా హెగ్డే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. వరుసగాప్లాప్ లు ఫేస్ చేయడంతో ఆమెను ఎవరూపట్టించుకోవడంలేదు. అందుకే ప్రస్తుతం హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఆమె ఆస్తుల విలువ దాదాపుగా 55 కోట్లవరకూ ఉంటుంది అని సమాచారం.
Rashmika
నేషనల్ క్రష్ రష్మిక మందన్న చివరిసారిగా యానిమల్‌లో కనిపించింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మిక ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తోంది బ్యూటీ. ఆసినిమాతో ఆమె ఇమేజ్ మరోలెవల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆమె ఆస్తులు దాదాపు 70 కోట్ల వరకూ ఉండొచ్చు అంటున్నారు.
నటి రాకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు రూ.1.5 నుంచి 3.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెల్గు వెలిగిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా పెళ్ళి కూడా చేసింది. ప్రస్తుతం భారతీయుడు 2లో నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ . జాకీ బగ్నాని ఇటీవల వివాహం చేసుకున్నారు రకుల్. ఇక ఆమె ఆస్తుల విలువ 50 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
Actress Keerthy
ఇక కీర్తి సురేష్ ఒక సినిమాకు 1 కోటి నుండి 4 కోట్ల వరకు అడుగుతుందట. ఆమె సంపాదన కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల సైరన్, రివాల్వర్ రీటా, రఘు దాదా చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ తెలుగులో కూడా వరుస ఆఫ్లు అందుకుంటోంది. ఇక ఆమె ఆస్తుల విలువ దాదాపు 45కోట్ల వరకూ ఉండుందని అంచనా.