- Home
- Entertainment
- Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?
Nayanam Review: తెలుగు వెబ్ సిరీస్ ‘నయనం’ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ గా నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం....

Nayanam
హ్యాపీడేస్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో వరుణ్ సందేశ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘నయనం’. ఈ సిరీస్ లో వరుణ్ నయన్ అనే ఓ కంటి డాక్టర్ గా కనిపిస్తారు. అయితే.. ఆయనకు చిన్నతనం నుంచి పక్కన వాళ్ల విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ‘మన చెవులు అబద్ధాన్ని అయినా వింటాయి. కానీ కళ్లు మాత్రం నిజాన్ని మాత్రమే చూస్తాయి.‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’’ అని ఓ టీచర్ చెప్పిన మాటను సీరియస్ గా నమ్మి తాను కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు.
అయితే.. అందరిలా నార్మల్ కంటి డాక్టర్ కాకుండా.. ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. న్యూటన్ గురుత్వాకర్షణ కనిపెట్టినట్లు కంటి సాయంతో ఇతరుల విషయాలను తెలుసుకునేలా ప్రయోగం చేస్తాడు. దాని కోసం ఓ స్పెషల్ ఇంజెక్షన్ తయారు చేస్తాడు. తన దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి కంట్లో ఇంజెక్షన్ చేస్తాడు. దాని ద్వారా వారి జీవితంలో ప్రతిరోజూ 12 నిమిషాలు చూడగలడు. దానిని 45 నిమిషాలకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి..
అయితే.. ఓ రోజు తన హాస్పిటల్ కి మాధవి( ప్రియాంక జైన్) ఐ చెకప్ కోసం నయన్ వద్దకు వస్తుంది. ఆమెను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోతాడు. కానీ, ఆమెకు గౌరీ శంకర్( ఉత్తేజ్) తో పెళ్లి అయిపోయిందని ఫీలౌతాడు. మాధవి, గౌరీ శంకర్ లకు చాలా వయసు వ్యత్యాసం ఉంటుంది. కానీ..ఆమెను ఆరాధించడం మాత్రం ఆపడు. రోజూ తన దగ్గర ఉన్న టెక్నిక్ సహాయంతో చూస్తూ ఉంటాడు. మాధవి, గౌరీ శంకర లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సడెన్ గా ఓ రోజు గౌరీ శంకర్ ని మాధవి చంపుతుంది. అలా ఎందుకు చంపిది..? ఈ విషయం తెలుసుకున్న తర్వాత నయన్ ఏం చేశాడు? వాళ్లు చేసిన క్రైమ్ కి నయన్ ఎలా బలి అయ్యాడు? పోలీసులకు ఎవరు దొరికారు? అసలు ఆమె భర్తను ఎందుకు చంపింది? అనే యాంగిల్ లో కథ సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ చాలా ఆకట్టుకునేలా ఉంటుంది.
నయనం ఎక్కడచూడాలి..?
నయనం వెబ్ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ సిరీస్ లను కోరుకునేవారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ తోపాటు చాలా సున్నితమైన అంశాన్ని కూడా ఇందులో తెలియజేశారు. సిరీస్ చూడటం మొదలుపెడితే... అయిపోయేవంత వరకు ఆపరు. చాలా ఆకట్టుకునేలా ఉంది. పక్క వారి జీవితాల్లో తొంగి చూడాలని చూస్తే ఎలాంటి చిక్కుల్లో పడాల్సి వస్తుందో చాలా బాగా చూపించారు.
ఇక.. నయన్ గా వరుణ్ సందేశ్, మాధవి పాత్రలో ప్రియాంక జైన్, పోలీస్ పాత్రలో అలీ రెజా చాలా బాగా నటించారు. డైరెక్టర్ కథను తీసుకువెళ్లిన విధానం ఆకట్టుకునేలా ఉంది.

