- Home
- Entertainment
- రెండు సూపర్ హిట్లు కొట్టిన బాండింగ్, కీర్తి సురేష్ పెళ్లి గురించి నాని క్రేజీ కామెంట్స్.. సమంత, ప్రగ్యా ఫిదా
రెండు సూపర్ హిట్లు కొట్టిన బాండింగ్, కీర్తి సురేష్ పెళ్లి గురించి నాని క్రేజీ కామెంట్స్.. సమంత, ప్రగ్యా ఫిదా
చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకుని కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకుని కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది.
keerthy suresh
కీర్తి సురేష్ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాని, కీర్తి సురేష్ కలసి రెండు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. మొదటగా నేను లోకల్ చిత్రంలో నటించారు. ఆ మూవీ హిట్ అయింది.
ఇక గత ఏడాది నటించిన దసరా చిత్రం నాని కెరీర్ లో మాస్ హిట్ గా నిలిచింది. దీనితో కీర్తి సురేష్, నాని మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఆ బాండింగ్ తోనే నాని.. కీర్తి సురేష్ పెళ్లి గురించిక్రేజీ కామెంట్స్ తో పోస్ట్ చేశాడు.
తన పెళ్ళిలో కీర్తి సురేష్ మూడు ముళ్ళు వేయించుకున్న తర్వాత భర్తని చూస్తూ సంతోషంలో ఎమోషనల్ అయింది. కంటతడి పెట్టుకుంది. ఆ ఫోటోని నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను మోస్ట్ మ్యాజికల్ మూమెంట్ ని చూశాను. ఆ అమ్మాయి, ఆమె ఎమోషన్ ఒక డ్రీం లాగా ఉంది అని నాని పోస్ట్ చేశాడు.
నాని పోస్ట్ కి ప్రగ్యా జైస్వాల్, సమంత లైక్స్ కొట్టి రియాక్ట్ అయ్యారు. హీరోయిన్లు కూడా నాని పోస్ట్ కి ఫిదా అవుతున్నారు. కీర్తి సురేష్ భర్త ఆంటోని రిసార్ట్ బిజినెస్ లో రాణిస్తున్నట్లు తెలుస్తోంది.