- Home
- Entertainment
- రష్మిక మందన్నా పేరు మారింది.. ట్రోలర్స్ కి దొరికిపోయింది.. పాపం నేషనల్ క్రష్ పరిస్థితేంటి?
రష్మిక మందన్నా పేరు మారింది.. ట్రోలర్స్ కి దొరికిపోయింది.. పాపం నేషనల్ క్రష్ పరిస్థితేంటి?
నేషనల్ క్రష్‌గా పాపులర్ అయ్యింది రష్మిక మందన్నా. ఇటీవల `పుష్ప` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఆడియెన్స్ ని ఓ ఊపు ఊపింది. ఇందులో ఆమె శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రష్మిక మందన్నా అంటే నేషనల్ క్రష్ అనే పేరే గుర్తొస్తుంది. ఆమెని చాలా మంది రష్మికగా కంటే నేషనల్ క్రష్‌గానే పిలుస్తున్నారు. అల్లు అర్జున్ అయితే ఏకంగా క్రష్మిక అంటూ పిలుస్తున్నాడు. ఇలా పిలవడం తనకు ఎంతో ఆనందంగా, ప్రౌడ్‌గా ఉందని ఫీలవుతుంది రష్మిక మందన్నా. `పుష్ప` చిత్రంలో రష్మిక.. `శ్రీవల్లి`గా ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. పాత్రకి ప్రాణం పోషింది. డీ గ్లామర్ రోల్‌లో మెస్మరైజ్ చేసింది. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది.
`పుష్ప` చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదలైంది. అన్ని చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది. ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఏకంగా హిందీలోనే 75కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగూ రష్మిక బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది. దీంతో ఇది కూడా `పుష్ప` చిత్రానికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.
అయితే `పుష్ప` చిత్రం శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. హిందీ వెర్షన్ కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ దీనికి మంచి స్పందన లభిస్తుందట. కానీ ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. డబ్బింగ్‌లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని కంప్లెయింట్ చేస్తున్నారు వ్యూవర్స్. సినిమాలోని మిస్టేక్స్ కి సోషల్ మీడియాలో పంచుకుంటూ పరువు తీస్తున్నారు. తాజాగా రష్మిక పేరు మారిపోయింది. ఆమె పేరు సైతం తప్పుగా పడిందట.
ఓటీటీలో సినిమా చూసే క్రమంలో రష్మిక మందన్నాకి బదులుగా రష్మిక మడోనా(rasmika madona) అని టైమ్ చేయడం గమనార్హం. తెలుగు వెర్షన్‌లో ఈ మిస్టేక్‌ని గుర్తించారు నెటిజన్లు. దీంతో దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ పిక్ వైరల్ అవుతుంది. ట్రోలర్స్ కి బలవుతుంది. పాపం రష్మిక ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయినట్టయ్యింది.
మేకర్స్, అమెజాన్ ప్రైమ్ చేసిన మిస్కేక్స్ కి ఇప్పుడు రష్మిక బలవ్వాల్సి వస్తుంది. ఆమెని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు చాలా చోట్లు రావు రమేష్ పాత్రని `ఎంపీ అని, ఎమ్మెల్యే అని పిలవడాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. కన్నడ, మలయాళంలో శేషాచలం అడవులకు సంబంధించిన విషయాలను కూడా తప్పుగా చూపించారని అంటున్నారు నెటిజన్లు. దీంతో `పుష్ప` సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంతోపాటు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.
నిజానికి థియేటర్ ప్రింట్‌లోనూ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. డబ్బింగ్ సెట్ చేయడానికి టైమ్ సరిపోలేదు, డిసెంబర్ 17న సినిమాని విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకోవడంతో దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి టైమ్ సరిపోలేదు. సినిమా సరైన డబ్బింగ్ వర్క్ లేకపోవడం, ఆర్‌ఆర్ సెట్ కాకపోవడం వంటి మిస్టేక్స్ చాలా కనిపిస్తున్నాయి. మరి వాటిని కనీసం ఓటీటీలోనైనా అమెజాన్ వాళ్లు సరిచేస్తారా ? లేదా చూడాలి. ప్రస్తుతం రష్మిక తెలుగులో `ఆడవాళ్లు మీకు జోహార్లు`, హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్‌బై` వంటి చిత్రాల్లో నటిస్తూ బి