MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NNNM: నారీ నారీ నడుమ మురారి మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేస్తే సినిమా వేరే లెవల్‌

NNNM: నారీ నారీ నడుమ మురారి మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేస్తే సినిమా వేరే లెవల్‌

శర్వానంద్‌ నటించిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ హిట్‌ అయ్యింది. శర్వాని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. కానీ ఈ సినిమా కోసం ముందు అనుకున్న హీరో శర్వానంద్‌ కాదట. మరి ఆ హీరో ఎవరనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 22 2026, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హిట్‌ ఖాతాలో పడ్డ `నారీ నారీ నడుమ మురారి`
Image Credit : X/@AKentsOfficial

హిట్‌ ఖాతాలో పడ్డ `నారీ నారీ నడుమ మురారి`

శర్వానంద్‌ చాలా గ్యాప్‌తో `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఆయన చిత్రం మంచి టాక్‌తో రన్‌ అయ్యింది. డీసెంట్ వసూళ్లని రాబడుతుంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయిన ఈ చిత్రం మరిన్ని వసూళ్లని కలెక్ట్ చేయబోతుంది. మిగిలిన సినిమాల జోరు తగ్గినా, ఈ చిత్రానికి మాత్రం మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. మొత్తానికి శర్వాకి హిట్ పడింది.

24
`నారీ నారీ నడుమ మురారి` చిత్రానికి నరేష్‌ అసలైన హీరో
Image Credit : X/@AKentsOfficial

`నారీ నారీ నడుమ మురారి` చిత్రానికి నరేష్‌ అసలైన హీరో

శర్వానంద్‌ హీరోగా నటించిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రానికి రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఆయన చివరగా `సామజవరగమన` చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకున్నారు. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. వీకే నరేష్‌, సిరి హనుమంతుతోపాటు వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను, సుదర్శన్‌, సంపత్‌ రాజ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇందులో శర్వానంద్‌తోపాటు నరేష్‌ కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఈమూవీకి అసలైన హీరో నరేష్‌. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Related Articles

Related image1
Nari Nari Naduma Murari మూవీపై బాలకృష్ణ క్రేజీ రియాక్షన్‌.. శర్వానంద్‌ బతికిపోయాడు
Related image2
The Raja Saab: రాజమౌళి వల్లే `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్‌, క్రేజీ రీజన్.. ఆ సెంటిమెంట్‌ ఇలా పనిచేసిందా?
34
నారీ నారీ నడుమ మురారి చేయాల్సిన హీరో నాగచైతన్య
Image Credit : instagram/@nagachaitanya

నారీ నారీ నడుమ మురారి చేయాల్సిన హీరో నాగచైతన్య

`నారీ నారీ నడుమ మురారి` మూవీ ముందు అనుకున్న హీరో శర్వానంద్‌ కాదట. నాగచైతన్యతో చేయాలనుకున్నారట. ఆయనతో చేసేందుకే దర్శకుడు రామ్‌ అబ్బరాజు ఈ స్క్రిప్ట్ రాశారట. కానీ నాగచైతన్యతో ప్రాజెక్ట్ సెట్‌ కాలేదు. కారణాలు తెలియదు కానీ, చైతూ ఈ మూవీ చేసేందుకు ఆసక్తి చూపించలేదట. దీంతో ఆ తర్వాత ఎవరు అని కొందరి పేర్లు వెతకగా శర్వానంద్‌ అయితే సూట్‌ అవుతాడనిపించి, ఆయనకు కథ చెప్పగా, వెంటనే ఓకే చేశాడని, అలా శర్వానంద్ తో ఈ మూవీ సెట్‌ అయ్యిందని సమాచారం.

44
బౌన్స్ బ్యాక్‌ అయిన శర్వానంద్‌
Image Credit : X/@AKentsOfficial

బౌన్స్ బ్యాక్‌ అయిన శర్వానంద్‌

శర్వానంద్‌కి అంతకు ముందు హిట్లు లేవు. ఆయనకు సక్సెస్‌ పది చాలా ఏళ్లు అవుతుంది. `మహానుభావుడు` మూవీ తర్వాత సరైన హిట్‌ పడలేదు. మధ్యలో `ఒకే ఒక జీవితం` మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. దాదాపు ఏడెనిమిది సినిమాలు డిజప్పాయింట్‌ చేశాయి. ఈ క్రమంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శర్వానంద్‌కి సాలిడ్‌ హిట్‌ పడిందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి కూడా సరైన థియేటర్లు లేక కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. పైగా శర్వానంద్‌ అనేసరికి బజ్‌ లేదు. ప్రమోషన్స్ చేయలేదు. ఇవన్నీ సినిమాపై ఎఫెక్ట్ చూపాయి. మంచి థియేటర్లు, మంచి ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా పెద్ద రేంజ్‌ హిట్‌ అయ్యేది. అదే సమయంలో నాగ చైతన్య చేస్తే ఈజీగా వంద కోట్ల మూవీ అయ్యేది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఏంటి.! జక్కన్న కూడా కాపీ బ్యాచ్‌నా.? ఆ సీనియర్ డైరెక్టర్‌తో పోల్చుతూ నెట్టింట చర్చ
Recommended image2
విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. వంద కోట్ల మూవీ ఒక్కటే, 3 డిజాస్టర్లు ఏంటో తెలుసా?
Recommended image3
Anand Deverakonda: విజయ్ పెళ్లి తర్వాత తమ్ముడికి ఫుల్ డిమాండ్.. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే?
Related Stories
Recommended image1
Nari Nari Naduma Murari మూవీపై బాలకృష్ణ క్రేజీ రియాక్షన్‌.. శర్వానంద్‌ బతికిపోయాడు
Recommended image2
The Raja Saab: రాజమౌళి వల్లే `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్‌, క్రేజీ రీజన్.. ఆ సెంటిమెంట్‌ ఇలా పనిచేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved