- Home
- Entertainment
- Nargis Comments: నర్గీస్ ఫక్రీ సెన్సేషనల్ కామెంట్స్, కనిపించనంత మాత్రాన ప్రెగ్నెంట్ అని తేల్చేస్తారా...?
Nargis Comments: నర్గీస్ ఫక్రీ సెన్సేషనల్ కామెంట్స్, కనిపించనంత మాత్రాన ప్రెగ్నెంట్ అని తేల్చేస్తారా...?
బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఏదో చిన్న విరామం కోసం తాను వెళితే.. దాన్ని కూడా అలుసుగా తీసుకుని కథలు అల్లుతారా..? అంటూ మండిపడింది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ నర్గీస్ ఈ మధ్య కొంత విరామం కోసం అమెరికా వెళ్లింది. హాయిగా కొన్ని నెలలు రెస్ట్ తీసకుని మళ్ళీ రీసెంట్ గా ఇండియాకు వచ్చింది. ఇక అప్పటి నుంచీ మొదలయ్యింది ఈమెకు సోషల్ మీడియా టార్చెర్.
నర్గీస్ ఫక్రీ ఇండియాకు తిరిగొచ్చిందన్న వార్త సోషల్ మీడియా జనాలకు మంచి స్టఫ్ అయ్యింది. చేతినిండా వాళ్లకు పని కల్పించింది. దీంతో ఆమె పై కొత్తకొత్త పుకార్లు స్టార్ట్ అయ్యాయి.. రకరకాల రూమర్లు బయలుదేరాయి.
ముఖ్యంగా నర్గీస్ ప్రెగ్నెంట్ అని.. అందుకే ఆమె విదేశాలకు వెళ్లిందని... రకరకాలుగా మాటలు వినిపించాయి. ఇదంతా చూసి ఫక్రీ ఫక్కున నవ్వుకుంది. శునకానందం కోసం ఎన్ని అబద్ధాలైనా రాస్తారు. నేను అవేవీ పట్టించుకోను. దీనివల్ల వాళ్లకు ఆనందం కలుగుతుందంటే కలగనివ్వండి అంటూ కామెంట్స్ చేసింది.
అంతే కాదు నర్గీస్ మాట్లాడుతూ.. సెలబ్రిటీల ప్రేమల గురించే కాదు,వాళ్ల శరీరాల గురించీ మాట్లాడుకోవడం వారికి కామన్ అయిపోయింది.. అనుకోకుండా నాకు విరామం వస్తే.. ప్రసూతి విశ్రాంతి అని తేల్చేశారు. నేను గర్భిణినని ప్రచారం చేశారంటూ మండి పడింది.
వాస్తవానికి ఆ టైమ్ లో తాను కాస్త బరువు బరువు పెరిగినట్టు చెప్పింది నర్గీస్. ఫలితంగా బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఎదుర్కొన్నానంటుంది.ఆ అనుభవం నుంచీ ఓ పాఠం నేర్చుకున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫేక్ న్యూస్‌పై పోరాటానికి సిద్ధం అవుతున్నది ఫక్రీ.