- Home
- Entertainment
- నరేష్-పవిత్ర బంధం వెనకున్న అసలు కారణం ఇదేనా? బయటకొస్తున్న సంచలన నిజాలు? తెరపైకి ఆస్తి మ్యాటర్?
నరేష్-పవిత్ర బంధం వెనకున్న అసలు కారణం ఇదేనా? బయటకొస్తున్న సంచలన నిజాలు? తెరపైకి ఆస్తి మ్యాటర్?
నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. వీరి వివాదం సంచలనంగా మారింది. ఇద్దరు కలిసి చేస్తున్న సహజీవనం, పెళ్లి అనే అంశాలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

పవిత్ర లోకేష్(Pavitra Lokesh), నరేష్(Naresh) గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నరేష్ తన మూడో భార్యని వదిలేసినప్పట్నుంచి ఒంటరిగా ఉన్న ఆయన `సమ్మోహనం` సినిమా టైమ్‌లో పవిత్రకి కనెక్ట్ అయ్యారని సమాచారం. అందులో వీరిద్దరు భార్యాభర్తలుగా నటించారు. సినిమాలో వీరి కెమిస్ట్రీ మతిపోయేలా ఉంటుంది. ఆ కెమిస్ట్రీ రియల్ లైఫ్‌లోనూ పండటంతో ఇద్దరు కలిసిపోయారని టాలీవుడ్‌లో వినిపించే మాట.
ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిది హిట్ పెయిర్‌గానూ పేరుతెచ్చుకుంది. దీంతో మేకర్స్ కూడా ఈ జంటని తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసేవారు. అదే సమయంలో నరేష్ కూడా తాను నటించే సినిమాల్లో పవిత్ర లోకేష్ ఉండేలా జాగ్రత్తపడేవారట. ఏదో రూపంలో ఆమెని కూడా తన సినిమాలోకి తీసుకునేలా చేసేవారని టాక్. అలా వరుసగా సినిమాల్లో కలిసి నటించడంతో ఇద్దరూ మరింత బాగా కనెక్ట్ అయ్యారు.
పైగా చాలా కాలంగా పవిత్ర లోకేష్ కూడా సింగిల్‌గానే ఉంటుంది. ఆమె తన భర్త సుచేంద్రప్రసాద్‌తో గొడవల నేపథ్యంలో ఆమె కూడా ఒంటరిగానే ఉంటుంది. అదే సమయంలో స్ట్రగుల్స్ లో ఉంది. ఆ టైమ్‌లో నరేష్ ఇచ్చిన భరోసా ఆయనకు దగ్గరగా చేసిందని టాక్. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఆయన సపోర్ట్ గా నిలవడంతో నరేష్‌కి ఆకర్షితులయ్యిందని సమాచారం. దీంతో ఈ ఇద్దరు కలిసి ఉంటూ సహజీవనం చేస్తున్నారనేది ఇప్పటి వరకు వినిపించేది, అందరు చెప్పే మాట.
అయితే నరేష్ తన మూడో భార్య రమ్యరఘుపతికి విడాకులివ్వలేదు. దీంతో మరో పెళ్లి చేసుకునే అవకాశం లేదు. అలాగే పవిత్ర కూడా తన భర్తతో విడాకులు రాలేదు. ఈ కారణంగా వీరిద్దరు పెళ్లిని పక్కన పెట్టి సహజీవనంతో సంతోషంగా ఉంటున్నారని, కానీ ఇటీవల పెళ్లి వార్తలు వచ్చిన నేపథ్యంలో రమ్యరఘుపతి తెరపైకి వచ్చి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ప్రస్తుతం ఇది సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. వివాదం పెరగడం వల్ల త్వరగా కోర్ట్ విడాకులు మంజూరు చేస్తుందని ఇద్దరూ భావిస్తున్నారట. అందుకోసమే పక్కా ప్లాన్‌తోనే నరేష్, పవిత్ర ఇలా చేస్తున్నారనేది ఓ వాదన.
ఇదిలా ఉంటే నరేష్-పవిత్ర లోకేష్ సంబంధంలో మరో కోణం బయటకు వస్తుంది. పవిత్ర లోకేష్‌ని పెళ్లి చేసుకోవడానికి, ఆమెతో సహజీవనం చేయడానికి మరో కారణం కూడా ఉందని అటు ఫిల్మ్ నగర్లో, ఇటు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆస్తుల కోసం నరేష్ ఇదంతా చేస్తున్నారని సమాచారం. నరేష్‌కి వేల కోట్ల ఆస్తులున్నాయి. ఆయన మదర్, గిన్నిస్ రికార్డ్ విన్నర్ విజయ నిర్మల అనే విసయం తెలిసిందే. ఆమె నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా రాణించారు. కృష్ణకి ఎన్నో విజయాలను అందించారు.
విజయ నిర్మల కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె వందల, వేల ఎకరాలు భూమిని కొనుగోలు చేసింది. నానక్ రామాగూడ, కోకాపేట వంటి ప్రాంతాల్లో వందల ఎకరాలు కొనుగోలు చేసినట్టు టాలీవుడ్లో వినిపించే మాట. అవన్నీ నరేష్ పేరిట రాశారట విజయనిర్మల. నరేష్.. విజయ్ నిర్మల మొదటి భర్త కొడుకు. ఆయన్నుంచి విడిపోయాక నరేష్ తల్లితోపాటే వచ్చేశాడు. అమ్మకు అన్ని విధాలుగా అండగా ఉన్నాడు. దీంతో తన మేజర్ ఆస్తులు నరేష్ పేరిట రిజిస్టర్ చేయించిందనేది టాక్. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉన్నా, తరచూ వినిపించే మాట ఇదే.
అయితే నటుడిగా నరేష్ సైతం బాగానే సంపాదించారు. బిజినెస్‌లు, అపార్ట్ మెంట్లు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాడని, అన్ని కలిసి వేలకోట్లు ఆయన ఆస్తులుంటాయని, వాటిని చూసుకోవడానికి మన అనే వారు ఒకరు కావాలని భావించారట నరేష్. అందుకే పవిత్రకి దగ్గరయ్యాడని భోగట్టా. పవిత్రలో నిజాయితీ, ఇన్నోసెన్సీ నచ్చిన ఆయన ఆమెకి కనెక్ట్ అయినట్టు సమాచారం.
నరేష్‌కి ముగ్గురు భార్యల ద్వారా ముగ్గురు పిల్లల సంతానం ఉంది. కానీ నవీన్ విజయ్ కృష్ణ(రెండో భార్య కుమారుడు) మాత్రం నరేష్‌తోపాటు ఉంటున్నారు. అయితే నవీన్ కెరీర్‌లో సెట్ కాలేదు. ఒకప్పుడు నరేష్‌తోనే ఉన్న ఆయన ఈ మధ్య దూరంగా ఉంటున్నారా? అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి. దీంతో నా అనుకునే వాళ్లు ఎవరూ లేరని భావించిన నరేష్.. తనకు తోడుతోపాటు తన ఆస్తులను చూసుకోవడానికి ఓ వ్యక్తి కావాలని, అది పవిత్రలో చూశాడని, అందుకే ఆమెకి కనెక్ట్ అయ్యారని టాక్. పవిత్రతో ఎమోషనల్ కనెక్టివిటీతోపాటు అంతర్లీనంగా నరేష్ ఆలోచన ఇదే అని వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.