- Home
- Entertainment
- మూడో భార్యపై రివేంజ్ కోసమేనా 'మళ్ళీ పెళ్లి' ?.. పవిత్రాతో మ్యారేజ్ అయిపోయినట్లేనా.. నరేష్ సమాధానం
మూడో భార్యపై రివేంజ్ కోసమేనా 'మళ్ళీ పెళ్లి' ?.. పవిత్రాతో మ్యారేజ్ అయిపోయినట్లేనా.. నరేష్ సమాధానం
నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు.

నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి.
పెళ్లి విషయం ఊరిస్తూనే ఈ సీనియర్ ప్రేమికులు 'మళ్ళీ పెళ్లి' అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. మే 26న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఇటీవల ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. నరేష్, పవిత్ర గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వారి ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకే మళ్ళీ పెళ్లి చిత్రాన్ని రూపొందించారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ గమనిస్తే నరేష్ రియల్ లైఫ్ లో జరిగిన పర్సనల్ విషయాలని, వివాదాలని ఈ ఈ చిత్రంలో బోల్డ్ గా చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. నరేష్, అతని మూడవ భార్య రమ్య రఘుపతి.. ప్రస్తుతం రిలేషన్ లో ఉంటున్న పవిత్ర మధ్య జరిగిన వ్యవహారాలు ఈ చిత్రంలో దాచుకోకుండా చూపించబోతున్నారు. త్వరలో రిలీజ్ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్, పవిత్ర మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మూడవ భార్యపై రివేంజ్ తీర్చుకోవడానికే ఈ చిత్రం తెరకెక్కించారా అని ప్రశ్నించగా నరేష్ ఆసక్తికరంగా బదులిచ్చారు. రివేంజ్ తీర్చుకోవాలంటే కత్తులతో పొడవాలి లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. అంతే కానీ కొన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీయం కదా అని సమాధానం ఇచ్చారు.
ఇక పవిత్ర లోకేష్ తో పెళ్లి గురించి కూడా నరేష్ స్పందించారు. మ్యారేజ్ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కానీ ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోయింది. ఫ్యామిలీ కోర్టులు ఎక్కువవుతున్నాయి. నా దృష్టిలో మ్యారేజ్ అంటే రెండు హృదయాలు కలవడం మాత్రమే. ఆ రకంగా చూసుకుంటే నాకు, పవిత్రకి పెళ్లి అయిందో లేదో మీరే నిర్ణయించుకోండి అని నరేష్ అన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. మాకు విజయ నిర్మల అమ్మగారి, కృష్ణ అంకుల్ గారి ఆశీర్వాదం ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నరేష్ తన మూడవ భార్య రమ్యరఘుపతితో విభేదాల కారణంగా ఆమెకి దూరంగా ఉంటున్నారు. ఓపెన్ గానే పవిత్ర లోకేష్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు.