గ్రాండ్‌గా నారా రోహిత్ పెళ్లి, హాజరైన గెస్ట్ లు వీరే.. స్టార్స్ ఎవరు వచ్చారంటే?
Nara Rohith Wedding: టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు. నటి శిరీషతో ఆయన వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ జరిగింది. అయితే ఈ పెళ్లికి బాలయ్య హాజరు కాకపోవడం గమనార్హం.

గ్రాండ్ గా నారా రోహిత్-శిరీష్ పెళ్లి
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన హీరోయిన్ శిరీష్‌ని వివాహం చేసుకున్నారు. గురువారం రాత్రి వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రేయసి శిరీష మెడలో మూడు ముళ్లు వేసి భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది.
పెళ్లి పెద్దగా మారిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
గ్రాండ్‌గా జరిగిన ఈ వెడ్డింగ్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నారా రోహిత్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు అనే విషయం తెలిసిందే. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతేడాది కన్నుమూశారు. దీంతో సీఎం చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లి పెద్దలుగా మారి రోహిత్, శిరీషల వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖుల కంటే రాజకీయ ప్రముఖులే ఎక్కువగా హాజరయ్యారు.
నారా రోహిత్ పెళ్లికి హాజరైన సెలబ్రిటీలు వీరే
ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎంపీ శ్రీభరత్, నందమూరి రామకృష్ణ, అటు నారా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ , అలాగే మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీవిష్ణు వంటి వారు కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. ప్రస్తుతం నారా రోహిత్, సిరి ల పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలయ్య అటెంట్ కాలేదా?
అయితే ఇందులో నందమూరి బాలకృష్ణ హాజరు కాలేదని తెలుస్తోంది. ఫోటోస్‌లో ఎక్కడా ఆయన కనిపించలేదు. వారంతా రిసెప్షన్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితోపాటు సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు రిసెప్షన్ రోజు అటెండ్ అవుతారని సమాచారం.
ప్రతినిధి 2 సినిమా టైమ్ లో ప్రేమలో పడ్డా రోహిత్, శిరీష
నారా రోహిత్, శిరీష కలిసి `ప్రతినిధి 2` సినిమా సమయంలో కలుసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ దశలోనే ప్రేమలో పడ్డారు. ఏడాదిలోనే మ్యారేజ్ చేసుకున్నారు. శిరీషది స్వస్థలం రెంటచింతల.