- Home
- Entertainment
- Movie Reviews
- బాహుబలి: ది ఎపిక్ మూవీ రివ్యూ.. రాజమౌళి మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
బాహుబలి: ది ఎపిక్ మూవీ రివ్యూ.. రాజమౌళి మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
రాజమౌళి రూపొందించిన `బాహుబలి` రెండు సినిమాలు ఇప్పుడు ఒకే మూవీగా వస్తున్నాయి. `బాహుబలి: ది ఎపిక్`గా శుక్రవారం నుంచి ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ మూవీ ఎలా అనిపించిందంటే?

బాహుబలి: ది ఎపిక్ మూవీ రివ్యూ
రాజమౌళి మదిలోనుంచి పుట్టిన అద్భుతమైన కళాఖండం `బాహుబలి` మూవీ. పదేళ్ల క్రితం మొదటి పార్ట్ విడుదలై పెద్ద విజయం సాధించింది. రెండేళ్ల తర్వాత విడుదలైన రెండో పార్ట్ `బాహుబలి 2` సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద విధ్వంసం సృష్టించింది. ఏకంగా ఈ చిత్రం రూ.1800కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపించింది. ముఖ్యంగా తెలుగు సినిమా గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ చిత్రాలు రావడం ప్రారంభమయ్యాయి. రెండు వేల కోట్ల సినిమా ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. రాజమౌళి రూపొందించిన `బాహుబలి` రెండు పార్ట్‌ల్లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ రమ్యకృష్ణ, అడవి శేషు, సుబ్బరాజు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ మూవీ రెండు భాగాలను కలిపి ఇప్పుడు ఒకే చిత్రంగా ఎడిట్ చేశారు రాజమౌళి. `బాహుబలి: ది ఎపిక్`గా దీన్ని డిజైన్ చేశారు. తాజాగా ఈ సినిమాని ఈ నెల 31 నుంచి మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇదొక ఫ్రెష్ మూవీలాగే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ తెప్పించాయి. మరి శుక్రవారం విడుదలైన ఈ మూవీ రెండు భాగాలను ఒకేసారి చూస్తే ఎలా అనిపించింది. కొత్త ఫీలింగ్ కలిగిందా? రివ్యూలో తెలుసుకుందాం.
బాహుబలి: ది ఎపిక్ కథ
`బాహుబలి` మూవీ కథేంటో ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఎందుకంటే ఈ చిత్రాలను థియేటర్లో చూశారు. ఓటీటీలో చూశారు. చాలా సార్లు టీవీల్లోనూ చూశారు. మహిష్మతి సామ్రాజ్యంలో రాజమాత శివగామి(రమ్యకృష్ణ) సారథ్యంలో రాజ్యపాలన జరుగుతుంది. ఆమెకి కొడుకు భళ్లాలదేవ(రానా) జన్మిస్తాడు. అదే సమయంలో బిజ్జలదేవ(నాజర్) తమ్ముడికి అమరేంద్ర బాహుబలికి కొడుకు బాహుబలి(ప్రభాస్) పుడతాడు. వీరిద్దరిని శివగామి పెంచి పెద్ద చేస్తుంది. యుద్ధ విద్యల్లో ఆరితేరేలా చేస్తుంది. ఇద్దరూ పెద్ద అవుతారు. వీరిలో ఎవరిని రాజుని చేయాలనేది ప్రశ్న. ఆ సమయంలోనే కాలకేయులు రాజ్యంపై దండయాత్ర చేస్తారు. ఈ యుద్ధంలో బాహుబలి, భళ్లాలదేవ పాల్గొని విజేతలుగా నిలుస్తారు. అయితే కాలకేయుడిని చంపినందుకు భళ్లాలదేవని రాజుగా చేస్తారని అంతా భావించారు. కానీ శివగామి ట్విస్ట్ ఇచ్చి బాహుబలిని రాజుగా, భళ్లాలదేవని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. బాహుబలిని రాజుగా పట్టాభిషేకం చేయడానికి ముందు ఒకసారి రాజ్యం అంతా తిరిగి చూసి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలని పంపిస్తుంది శివగామి. అలా వెళ్లిన బాహుబలి కుంతల రాజ్యంలో దేవసేన(అనుష్క)ని చూసి ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇంతలో దేవసేన అందాన్ని చూసి భళ్లాలదేవ మనసు పడతాడు. అమ్మని కోరిక కోరగా ఆమె దేవసేనతో పెళ్లి చేయిస్తానని మాట ఇస్తుంది. కానీ దేవసేన, బాహుబలి ప్రేమించుకుంటున్నారనే విషయం ఆమెకి తెలియదు. దేవసేనని తీసుకుని రాజ్యానికి వచ్చినప్పుడు బాహుబలికి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది శివగామి. దేవసేనని భళ్లాలదేవకి ఇచ్చి పెళ్లి ప్రకటన చేయడంతో బాహుబలి షాక్ అవుతాడు. ఆమెకోసం రాజ్యాన్ని వదులుకుంటాడు. దీంతో భళ్లాలదేవుడు రాజు అవుతాడు. అయితే బాహుబలికి ప్రజల్లో ఉన్న మంచిపేరుని చూసి ఇతని వల్ల ఎప్పుడైనా మనకు ప్రమాదమే అని భావించిన భళ్లాలదేవ అతన్ని చంపేసేందుకు కుట్ర పన్నుతారు. శివగామి చేతనే బాహుబలిని చంపేసేందుకు కుట్ర చేయించిడం విశేషం. అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
బాహుబలి: ది ఎపిక్ విశ్లేషణ
`బాహుబలి` రెండు పార్ట్ లను కలిపి ఒక్క మూవీగా చేయడం చాలా కష్టం. నిడివి సమస్య వస్తుంది. దీంతో చాలా సీన్లు కట్ చేశారు. కథకి అవసరం లేని సీన్లు అన్నింటిని లేపేశారు రాజమౌళి. ఆడియెన్స్ చూసి ఎంజాయ్ చేసే సీన్లని, ఎలివేషన్లని మాత్రమే ఉంచారు. మెయిన్ ఎపిసోడ్లని మాత్రమే ఉంచారు. ఎమోషనల్ సీన్లని ఉంచారు. కథని డైవర్స్ చేసే సీన్లన్నింటిని కట్ చేశాడు రాజమౌళి. తమన్నాతో లవ్ ట్రాక్, మూడు పాటలు, వార్‌లోని కొన్ని సీన్లని కట్ చేసినట్టు రాజమౌళినే తెలిపారు. అవి లేకపోయినా సినిమాలో ఎలాంటి లోటు లేకుండా ఎడిట్ చేయడం విశేషం. కథ ఫ్లోకి దెబ్బతినకుండా, ఎమోషన్స్ మిస్ కాకుండా, ఎడిట్ చేసిన తీరు బాగుంది. కాకపోతే తమన్నాతో లవ్ ట్రాక్ లేకపోవడంతో ... గ్లామర్ సైడ్ ఆశించిన వారికది కొంత లోటుగా ఉండే అవకాశం ఉంది. వాయిస్ ఓవర్‌తో వాటిని కవర్ చేశారు. శివుడు పెరిగే సీన్లు కనిపించలేదు. ప్రారంభంలో మహిష్మతి సామ్రాజ్యంలో జరిగిన కుట్ర, మహేంద్ర బాహుబలిని శివగామి కాపాడే సన్నివేశాలు చూపించారు. అనంతరం అడవిలో శివుడిగా పెరగడం, పెద్ద జలపాతాల వెనుక ఏముందనేది తెలుసుకోవాలని చిన్నప్పట్నుంచి శివుడు తాపత్రయపడటం, అందుకోసం వందకు పైగా ప్రయత్నాలు చేసి.. విఫలం కావడం, ఆ తర్వాత ఓ అందమైన అమ్మాయి అవంతికని ఊహించుకుని ఎట్టకేలకు అక్కడికి చేరుకోవడం హైలైట్‌గా ఉంది. సినిమాలో మెయిన్ ఎపిసోడ్లని ఉంచడంతో ఎక్కడా మూవీ డౌన్ అనే ఫీలింగ్ ఉండదు. మధ్య మధ్యలో కొంత డ్రాప్ అనిపించినా, వెంటనే హై ఇచ్చే సీన్లు రావడంతో ఆ ఫీల్ కనుమరుగై పోతుంది. ఎమోషన్ సీన్లు, యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్లు హైలైట్‌గా ఉన్నాయి. ఆయనకు పడ్డ ఎలివేషన్లు హై ఫీల్ ఇస్తాయి. ఇటీవల చాలా సినిమాల్లో ఇలాంటి ఎలివేషన్లు వస్తున్న విషయం తెలిసిందే. కానీ వాటిని మించి ఇందులో ఉండటం విశేషం. అప్పుడు కూడా ఇంతగా ఆడియెన్స్ ఫీలయ్యారో లేదో తెలియదు కానీ, ఇందులో మాత్రం ఆ ఫీల్ ఉండటం విశేషంగా చెప్పొచ్చు.
బాహుబలి: ది ఎపిక్ లో హైలైట్స్
ప్రభాస్ జలపాతాలను ఎక్కే సీన్లు, ఆయా విజువల్స్ వాహ్ అనిపిస్తాయి. విజువల్ వండర్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత ప్రభాస్ కోటలోకి ఎంట్రీ ఇచ్చే సీన్లు సైతం వాహ్ అనిపిస్తాయి. మరోవైపు రానా.. అడవి దున్నతో చేసే ఫైట్ సీన్ బాగుంది. ప్రభాస్ పారిపోయే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఆ సమయంలోనే శివుడిని చూసి బాహుబలిగా అంతా పిలవడం, ట్విస్ట్ రివీల్ అవుతున్న సమయంలో గూస్ బమ్స్ పక్కా. బాహుబలిని కట్టప్న చంపినట్టు రివీల్ చేస్తారు. అంతటితో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. బాహుబలి గతం గురించి సత్యరాజ్ కథ చెప్పడం, ఇక మహిష్మతి రాజ్యంలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా ఎదిగే సీన్లని చూపించారు. వాటిని షార్ట్ గా చూపించారు. డైరెక్ట్ గా రాజు ఎవరనేది, చిన్న చిన్న యాక్షన్ సీన్లనిచూపించారు. కాలకేయులతో యుద్ధాన్ని మెయిన్ చేశారు. ఇది మరోసారి హైలెట్ అయ్యింది. అనంతరం ప్రభాస్ కుంతల రాజ్యానికి వెళ్లడం అక్కడ దేవసేన అనుష్కని చూసి ఫిదా అవ్వడం, అక్కడ కూడా యాక్షన్ సీన్లు, కామెడీ సీన్లని ఉంచారు. అవి మరోసారి ఆకట్టుకున్నాయి. ఆయా విజువల్స్ సైతం మెస్మరైజ్ చేస్తాయి. అక్కడ యుద్ధం సీన్లు కూడా ఉంచారు. కాకపోతే కొంత వరకే ట్రిమ్ చేశారు. కానీ కుంతర రాజ్యంలో బాహుబలి రివీల్ అయ్యే సీన్ అదిరిపోయింది. అనుష్కతో పాటు ప్రభాస్ మహిష్మతి రాజ్యానికి వచ్చే సాంగ్ ఉంది. అది అద్భుతంగా అనిపించింది. అనంతరం రాజ్యంలోని యాక్షన్ సీన్లు, సైన్యాధ్యుక్షుడి తలనరికే సీన్లు అంతే వాహ్ అనిపిస్తాయి. అందులో కూడా ఎలివేషన్లు మతిపోయేలా ఉన్నాయి. బాహుబలిని చంపేందుకు శివగామితో భళ్లాలదేవ, బిజ్జలదేవ చేసిన కుట్ర ఎమోషనల్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ ఏంటో తెలిసిందే.
మైనస్ చెప్పాల్సినవి ఇవే
అయితే బాహుబలి రెండు పార్ట్ లు మన మైండ్‌లో ఉండటంతో ఈ మూవీ చూసినప్పుడు ఆ కట్ కట్ ఫీలింగ్ కలుగుతుంది. హైలైట్ ఎపిసోడ్లని మాత్రమే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎక్కడా డ్రాప్ లేదు. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగింది. మధ్య మధ్యలో కొన్ని సీన్లు రొటీన్ అనిపించింది. డల్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ వెంటనే వాటినే డామినేట్ చేసే ఎలివేషన్లు పడటంతో బోర్ ఫీలింగ్ ఉండదు. అయితే సినిమా ఓవరాల్‌గా మళ్లీ కొత్త మూవీ చూసిన ఫీలింగ్ కలగడం విశేషం. ఎమోషన్స్ మిస్ కాకుండా దాన్ని తీర్చిదిద్దిన తీరు కూడా బాగుంది. ఈ మూవీ కొత్త ఆడియెన్స్ కి బాగా నచ్చుతుంది. పాత ఆడియెన్స్ ని కూడా మెప్పిస్తుందని చెప్పొచ్చు. వాళ్లు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. విజువల్స్, యాక్షన్ ఎలివేషన్లు మతిపోయేలా ఉన్నాయి. సినిమాకు ఇవే హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీ చూస్తుంటే మళ్లీ ఇది బాక్సాఫీసుని షేక్ చేసేలా ఉందనిపిస్తోది.
బాహుబలి: ది ఎపిక్ ఆర్టిస్టుల నటన ఎలా అనిపించిందంటే?
ప్రభాస్ బాహుబలిగా, శివుడిగా అదరగొట్టారు. రెచ్చిపోయారు. చాలా సీన్లల్లో గూస్ బంమ్స్ తెప్పించారు. భళ్లాలదేవగా రానా అదరగొట్టాడు. ఆయన కెరీర్ బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. దేవసేనగా అనుష్క శెట్టి సైతం మెస్మరైజ్ చేసింది. యువరాణిగా యాక్షన్ సీన్లలో అదరగొట్టింది. మరోవైపు శివగామిగా రమ్యకృష్ణ నటన ఇప్పుడు మరింత ఎలివేట్ అయ్యింది. చాలా సీన్లల్లో ఆమె ప్రభాస్, రానా, అనుష్క, ఇలా అందరినీ డామినేట్ చేసింది. ఆమెనే హీరో అనే ఫీలింగ్ తెప్పించింది. బిజ్జలదేవగా నాజర్ సైతం వాహ్ అనిపించాడు. కట్టప్పగా సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే తమన్నా సీన్లు చాలా లేచిపోయాయి. ఆమెది సినిమాలో గెస్ట్ రోల్ గా మారిపోయింది. మిగిలిన పాత్రలు కూడా బాగానే అనిపించాయి.
`బాహుబలి: ది ఎపిక్` టెక్నీషియన్ల పనితీరు
సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం, బీజీఎం హైలైట్. ఎలివేషన్ సీన్లలో గూస్ బంమ్స్ తెప్పించారు. పాటలు సూపర్ హిట్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రంతో కీరవాణి మరోసారి హైలైట్ అవుతారు. విజువల్స్ వండర్ గా చెప్పాలి. వీఎఫ్‌ఎక్స్ కొన్ని తేలిపోయినా ప్రకృతిని చూపించే సీన్లు మాత్రం వండర్ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా జలపాతం, మహిష్మతి రాజ్యాన్ని చూపించే సీన్లు, కుంతల దేశం సీన్లు, నది నుంచి అనుష్కతో కలిసి ప్రభాస్ వచ్చే సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు వాహ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. దర్శకుడు రాజమౌళి పర్‌ఫెక్ట్ గా ఎడిట్ చేశారు. ఈ మూవీ కోసం ఆయన కష్టం కనిపిస్తోంది. ఇప్పటి ఆడియెన్స్ కి కావాల్సిన విధంగా మూవీని కట్ చేశారు. దీంతో సినిమా మరోసారి థియేటర్లలో దుమ్ములేపబోతుందని చెప్పొచ్చు. నిర్మాతలు రాజీలేకుండా ఈ మూవీని ఆడియెన్స్ కి తీసుకువచ్చే సాహసం చేయడం విశేషం. వారికిది కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గా
బాహుబలి ఇప్పటికే బాక్సాఫీసు వద్ద నిరూపించుకుంది. అలాగే ఈ ఎపిక్ మూవీ సైతం అదిరిపోయింది. అద్భుతమైన థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చింది. ఆల్‌రెడీ నిరూపించుకున్న సినిమా కావడంతో దీనికి రేటింగ్ అవసరం లేదు. చూసి ఎంజాయ్ చేయడమే.