అల్లు అర్జున్ పుష్ప సినిమాలో షెకావత్ పాత్రను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలను మిస్ అయిన నటులు చాలామంది ఉన్నారు. వారిలో షెకావత్ క్యారెక్టర్ ను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప', పుష్ప 2'. ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం సాధించాయి. దర్శకుడు సుకుమార్ తన మార్క్ తో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకున్నాయి. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటించాడో, నాగవల్లిగా అంతకు మించిన యాక్టింగ్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్న.
అయితే ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ పాత్రలో నటించిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్యారెక్టర్ కు ఆయన అయితేనే న్యాయం చేస్తాడు అనేట్టుగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు ఫహాద్. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం షెకావత్ పాత్ర చేయాల్సింది ఫహాద్ కాదని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫహాద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కు ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నారా రోహిత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఎందుకో ఆయన ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేకపోయారు. దాంతో ఈ పాత్ర ఫహాద్ ఫాజిల్ చేతిలోకి వెళ్లింది. ఆ పాత్రలో తనదైన ముద్రవేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మలయాళ హీరో.
ఈ వార్త తెలిసిన తర్వాత నారా రోహిత్ అభిమానులు కొంత వరకూ నిరాశ చెందారు ఎందుకంటే 'పుష్ప'లాంటి భారీ బ్లాక్ బస్టర్ లో ముఖ్యమైన పాత్రను పోషించడానికి అవకాశం వస్తే వదులుకున్నాడేంటి అని గుసగుసలాడుకుంటున్నారు. ఇక తాజాగా భైరవం' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రోహిత్. ఈ సినిమాలో అతని పాత్ర అంద్భుతంగా ఉందని ప్రశంసలు వినిపిస్తున్నాయి.
యాక్టింగ్ కు చాలా గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ రీసెంట్ గా మళ్లీ యాక్టీవ్ అవుతున్నాడు. వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇక నారా రోహిత్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అభిమానుల్లో కూడా నమ్మకం పెరిగింది.