MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాని `సరిపోదా శనివారం` OTT రిలీజ్ డేట్ లాక్

నాని `సరిపోదా శనివారం` OTT రిలీజ్ డేట్ లాక్

 దసరా, హాయ్ నాన్న బ్యాక్ టు బ్యాక్ హిట్లతో  సూపర్ ఫామ్ లో ఉన్న నానీ తాజా చిత్రం సరిపోదా శనివారం. 

2 Min read
Surya Prakash
Published : Sep 16 2024, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ విభిన్న కథలను, దర్శకులను  ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు నటుడు నాని (Nani). ‘దసరా’తో తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆయన మరోసారి సత్తా చాటారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సైతం రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు (గ్రాస్‌) సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆనందం వ్యక్తం చేసింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో `ప్రేమదేశం ` లవ్‌ స్టోరీ

 

25
Nani, Saripodhaa Sanivaaram, Movie Review

Nani, Saripodhaa Sanivaaram, Movie Review

‘‘ఇప్పుడు సరిపోయింది. మీరంతా (ప్రేక్షకులు) ఈ చిత్రాన్ని ఆదరించి.. బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిపారు’’ అని పేర్కొంది. ‘బాక్సాఫీసు శివతాండవమే’ పేరుతో కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ క్రమంలో OTT రిలీజ్ డేట్ కూడా లాక్ అయ్యిందని మీడియా వర్గాల సమాచారం. 

  దసరా, హాయ్ నాన్న బ్యాక్ టు బ్యాక్ హిట్లతో  సూపర్ ఫామ్ లో ఉన్న నానీ తాజా చిత్రం సరిపోదా శనివారం.  డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన  ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచి  మంచి అంచనాలే ఉన్నాయి. ఈ దర్శకుడుతో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం చేసారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాకపోయినా ఫ్యామిలీలకు బాగానే నచ్చింది.

ఇప్పుడు రూట్ మార్చి మాస్ ఆడియన్స్ కోసం సరిపోదా శనివారం చిత్రం తెచ్చారు. పోస్టర్స్, టీజర్స్ లో ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచానాలు  పెంచి కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను ఆదరించటానికి రెడీ అయ్యింది.

35
Nani, Saripodhaa Sanivaaram, Movie Review

Nani, Saripodhaa Sanivaaram, Movie Review

 ‘సరిపోదా శనివారం’ చిత్రం నెట్  ప్లిక్స్ లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సౌతిండియాలోని అన్ని లాంగ్వేజ్ లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు.  ‘అంటే సుందరానికీ!’ తర్వాత నాని హీరోగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన యాక్షన్‌ మూవీ ఇది.

శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్యగా నాని, సీఐ దయానంద్‌గా ఎస్‌.జె. సూర్యల మధ్య ఘర్షణ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ‘షోలే’, ‘ఒక్కడు’ తర్వాత ఈ సినిమా విషయంలోనే విలన్‌ పాత్ర గురించి ప్రేక్షకులు చర్చించుకున్నారు. ఆగస్టు 29న విడుదలైన సినిమా హవా కొనసాగిస్తూనే ఉంది.

45
Nani, Saripodhaa Sanivaaram, Movie Review

Nani, Saripodhaa Sanivaaram, Movie Review

నాని (Nani) యాక్షన్ అవతారం ఆకట్టుకుంటుంది. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఉద్యోగిగా సహజ సిద్ధమైన లుక్, నటనతో ఒకవైపు అలరిస్తూనే, మరోవైపు కోపంతో రగిలిపోయే కోణాన్ని ప్రదర్శించాడు. ఎస్.జె.సూర్య (S. J. Suryah) పోషించిన ఇన్‌స్పెక్టర్ దయానంద్ పాత్ర సినిమాకి కీలకం. క్రూరత్వం ప్రదర్శిస్తూ, తన చూపులతోనే భయపెడుతూ విలనిజం ప్రదర్శించాడు.

ఆ పాత్రకి సరైన ఎంపిక అని చాటి చెప్పారు. చారులత పాత్రలో ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) అలరిస్తుంది. నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పే అంటూ మురళీశర్మ తెరపై కనిపించిన విధానం, ఆయన పాత్ర సినిమాకి మరో ఆకర్షణ. సాయికుమార్;, అదితి బాలన్, అభిరామి, హర్షవర్ధన్, మైమ్‌ మధు, అజయ్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు.

55
Saripodhaa Sanivaaram review

Saripodhaa Sanivaaram review

కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’తో నాని తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ చిత్రం మంచి వసూళ్లతోపాటు తాజాగా పలు విభాగాల్లో ‘సైమా- 2024’ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌, ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్‌, ఉత్తమ సహాయ నటుడిగా దీక్షిత్‌ శెట్టి పురస్కారాలు అందుకున్నారు.

నాని హీరోగా నూతన దర్శకుడు తెరకెక్కించిన ‘హాయ్‌ నాన్న’ సైతం ‘సైమా’ పురస్కారాలు సొంతం చేసుకోవడం విశేషం. ఉత్తమ సహాయ నటి (బేబీ కియారా ఖాన్‌) సహా ఆరు కేటగిరీల్లో సత్తా చాటింది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved