నాని తెలివిగా తప్పుకోవడంతో నితిన్ బలి.. అసలైన ట్విస్ట్ ఇంకొకటి ఉంది తెలుసా ?
నితిన్ నటించిన తమ్ముడు చిత్రంతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే అది 100 శాతం హిట్ అనే నమ్మకం చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో ఉండేది. కానీ ఇటీవల దిల్ రాజు కథల జడ్జిమెంట్ విషయంలో ట్రాక్ తప్పుతున్నారు.

నితిన్ నటించిన తమ్ముడు చిత్రంతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే అది 100 శాతం హిట్ అనే నమ్మకం చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో ఉండేది. కానీ ఇటీవల దిల్ రాజు కథల జడ్జిమెంట్ విషయంలో ట్రాక్ తప్పుతున్నారు. ఫ్యామిలీ స్టార్, థాంక్యూ, గేమ్ ఛేంజర్, తాజాగా తమ్ముడు చిత్రాలు ఊహించని డిజాస్టర్స్ అయ్యాయి. ఇటీవల ఆయనకి ఊరటనిచ్చిన అంశం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రమే.
తమ్ముడు చిత్రం ఘోర పరాజయం దిశగా పయనిస్తుండడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి కూడా చర్చ మొదలైంది. ఆయన దర్శకత్వం వహించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (MCA) చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ కూడా విజయం సాధించడంతో వేణు శ్రీరామ్ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారారు.
అలాంటి సమయంలో, ఆయన మరో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి, నానికి వినిపించారు. ఆ స్క్రిప్ట్‌కి ‘తమ్ముడు’ అనే టైటిల్ పెట్టారు. అయితే తమ్ముడు చిత్రాన్ని నాని రిజెక్ట్ చేశారు. ఈ స్క్రిప్ట్ లో ఏదో తేడా ఉందని ముందుగానే నాని గ్రహించినట్లు ఉన్నారు. అందుకే తెలివిగా ఈ కథని రిజెక్ట్ చేశారు. నానికి కథల ఎంపిక విషయంలో మంచి అభిరుచి ఉంది. నాని తిరస్కరించిన తర్వాత, వేణు శ్రీరామ్ అదే సమయంలో ‘ఐకాన్’ అనే మరో కథను అల్లు అర్జున్కి వినిపించారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
తర్వాత వేణు శ్రీరామ్ రాసిన ‘తమ్ముడు’ కథ నితిన్ వద్దకు చేరింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ తో పాటు ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. వరుస పరాజయాలతో ఉన్న నితిన్, ఈ కథని ఎలా ఒప్పుకున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా నాని రిజెక్ట్ చేసిన కథతో నితిన్ బలయ్యాడు.
ఇక్కడ మరో ఆసక్తికర ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. నితిన్ చేయబోయే తదుపరి చిత్రం ఎల్లమ్మ కూడా నాని రిజెక్ట్ చేసిన కథే. బలగం వేణు దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.