- Home
- Entertainment
- నాని రిజెక్ట్ చేసిన 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా? నేచురల్ స్టార్ ఆ మూవీస్ చేసుంటే..?
నాని రిజెక్ట్ చేసిన 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా? నేచురల్ స్టార్ ఆ మూవీస్ చేసుంటే..?
మాస్ ఇమేజ్ కోసం చాలా కష్టపడుతున్నాడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.మూసధోరణి వదిలిపెట్టి.. ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక నాని రిజెక్ట్ చేసిన బ్లక్ బస్టర్ హిట్ సినిమాలేంటి?

కొత్తగా ప్రయత్నిస్తున్న నాని
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలదో దూసుకుపోతున్నాడు. గతంలో లవర్ బాయ్ గా.. వరుస ప్రేమ కథలను చేసిన ఈ హీరో.. మూసధోరణి నుంచి బయటపడ్డాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నహీరోకు టాలీవుడ్ లో కెరీర ఉండదని గ్రహించిన నాని.. రిస్క్ అయినా పర్వాలేదు అని ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. నాని నుంచి హిట్ 3 లాంటి హెవీ వైలెన్స్ సినిమాలను ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. దసర, ప్యారడైజ్ లాంటి మూవీస్ తో నాని మాస్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు. రిస్క్ చేసినా.. నాని అందులో కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
ప్యారడైజ్ తో రాబోతున్న నేచురల్ స్టార్..
ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి..అష్టచమ్మా సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించిన నాని, ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ.. స్టార్ డమ్ ను సాధించాడు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ.. కింద స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నాని. . ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాతో మరోసారి తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నాని మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలు..
ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సినిమాలను, కథలను అంచనా వేయలేరు. వారు రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే నాని కూడా తన కెరీర్‌లో చాలా కథలను రిజెక్ట్ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఆ కథలలో కొన్ని వేరే హీరో దగ్గరకు వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
అయితే ఈ కథలను నాని నిజంగా రిజెక్ట్ చేశాడా లేదా తెలియదు కానీ.. టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రాకారం నేచురల్ స్టార్ 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాడని అంటుంటారు. ఆ హిట్ సినిమాలు చేసి ఉంటే.. నాని కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నాని రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు
నితిన్ కెరీర్ నే మార్చేసిన సినిమాల్లో ఇష్క్ ఒకటి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్ సినిమా కథ.. మొదట నాని దగ్గరకే వెళ్లిందట. కానీ ఆ టైమ్ లో నానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో... నితిన్ తో ఆమూవీని చేశారు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘భలే మంచి రోజు’ సినిమా కథను కూడా ముందుగా నానికే చెప్పినట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా విడుదలైన తర్వాత మంచి గుర్తింపును సంపాదించింది.
మాస్ ఇమేజ్ కోసం నాని ప్రయత్నాలు..
ఇక నానీతో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా చేసిన దర్శకుడు హను రాఘవపూడి.. ఆతరువాత చాలా సినిమాలు ప్లాన్ చేశాడట. కానీ నానితో వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది. హను దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘సీతారామం’ సినిమా కథ కూడా నాని కోసమే రాసుకున్నాడట. కాని నాని అప్పటికే మాస్ ఇమేజ్ వెంట పరుగెడుతున్నాడు.. ఈ టైమ్ లో.. ఇలాంటి సబ్జెక్ట్ చేయడం కరెక్ట్ అనిపించలేదట. దాంతో ఈ కథ దుల్కర్ దగ్గరకు వెళ్లింది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు.. మలయాళ హీరో ఇమేజ్ తో టాలీవుడ్ లో భారీగా పెంచేసింది.
ఆ నాలుగు సినిమాలు నాని చేసిఉంటే..?
ఇక రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా కూడా మొదట నాని కోసమే అనుకున్నారని సమాచారం. కానీ కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నాని సూచించడంతో, ఆ ప్రాజెక్ట్ దుల్కర్‌తో ముందుకు వెళ్లి సూపర్ సక్సెస్‌గా నిలిచింది. నాని ఈ నాలుగు సినిమాలు చేసి ఉంటే కెరీర్ మరింత వేరే స్థాయిలో ఉండేదని కొందరి అభిప్రాయం. కానీ ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. నాని తన కెరీర్ ను పాన్ ఇండియా రేంజ్ లో డిజైన్ చేసుకున్నాడు. ప్యారడైజ్ మూవీ హిట్ అయితే.. నేచురల్ స్టార్ టైర్ 1 హీరోల లిస్ట్ లో చేరే అవకాశం కూడా ఉంది.

