- Home
- Entertainment
- ఇంకా షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే 80కోట్లు రాబట్టిన నాని సినిమా, నేచురల్ స్టార్ రచ్చ వేరే లెవల్
ఇంకా షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే 80కోట్లు రాబట్టిన నాని సినిమా, నేచురల్ స్టార్ రచ్చ వేరే లెవల్
Nani: హీరో నాని ఇటీవలే `హిట్ 3`తో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు `పారడైజ్` సినిమాని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన వార్త గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nani
నేచురల్ స్టార్ నాని ఇటీవలే `హిట్ 3`తో విజయాన్ని అందుకున్నారు. తన జోనర్ మార్చి చేసిన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఇందులో నాని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఇంతటి మాస్‌ని ఎప్పుడూ చూపించలేదు.
`దసరా` చిత్రంలో రా అండ్ రస్టిక్ రోల్ చేశారు. కానీ ఇంతటి యాక్షన్ లేదు. `సరిపోదా శనివారం`లోనూ యాక్షన్ ఉంది, కానీ ఇంతటి క్రూరంగా లేదు. `హిట్ 3`తో పూర్తిగా తన స్టయిల్‌ని మార్చేశారు నాని.
Nani
మాస్ ఇమేజ్ కోసమే ఆయన ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్‌గా, నేచురల్ స్టార్‌గా పిలిపించుకుంటే కొద్ది మార్కెట్‌కే పరిమితమవ్వాల్సి వస్తుంది. తన క్రేజ్, ఇమేజ్‌తోపాటు మార్కెట్‌ని పెంచుకునే ప్రయత్నంలోనే నాని ఇలాంటి ఊరమాస్ మూవీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అందులో భాగంగానే ఇప్పుడు వాటిని మించిన మాస్, క్రూయాల్టీ ఉన్న మూవీ `పారడైజ్` చేస్తున్నారు. ఇది నాని గత చిత్రాలకు మించి ఉండబోతుందని, తెలుగు చిత్ర పరిశ్రమలోనే అంత్యంత రా రస్టిక్ మూవీగా ఉండబోతుందని అర్థమవుతుంది.
Nani
`పారడైజ్` టీజర్ కూడా విడుదలైంది. ఒక విటురాలు కొడుకు కథ ఇది అని, అతను అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, ఎంతో మందిచేత తొక్కబడి, వారిపై తిరగబడి, తన మనుగడ కోసం నిలబడే పాత్రలో, తాను నాయకుడిగా ఎదిగే పాత్రలో నాని నటిస్తున్నట్టుగా టీజర్ ని బట్టి అర్థమైంది.
ఇందులో వాడిన భాష వింటుంటే ఎంత దారుణంగా నాని పాత్ర, `పారడైజ్` కథ ఉండబోతుందో అర్థమవుతుంది. దీంతో సినిమాపై ప్రారంభానికి ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కోసం ఓటీటీ సంస్థలు ఎగబడుతున్నాయట.
Nani
`దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓడెల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. `దసరా` పెద్ద హిట్ అయిన నేపథ్యంలో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఇప్పటికే ఆడియో రైట్స్, ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
ఆడియో రైట్స్ ఏకంగా 18 కోట్లకు సరిగమప మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసిందట. అంతేకాదు ఓటీటీ రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇది 60కోట్లకుపైగానే సేల్ అయ్యిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.
Nani
ఇలా `పారడైజ్` మూవీ షూటింగ్ ప్రారంభానికి ముందే ఏకంగా రూ.80కోట్లు రాబట్టడం విశేషం. ఈ లెక్కన ఇప్పటికే నిర్మాతలు ప్రాజెక్ట్ విషయంలో సేఫ్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వరుసగా బ్యాక్ టూ బ్యాక్ నాని విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో ఆయన చిత్రాలు వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబడుతున్న నేపథ్యంలో మార్కెట్ పరంగా ఆయన చిత్రాలకు బాగా డిమాండ్ ఉందని తెలుస్తుంది.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కయాదు లోహర్‌ని పరిశీలిస్తున్నారట. ఇక ఈ మూవీ షూటింగ్ ఈ నెలారుఖులో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.