- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: భార్యని ఇంట్లోంచి బయటికి గెంటేసిన నందు.. భర్తని అరెస్టు చేయించిన లాస్య!
Intinti Gruhalakshmi: భార్యని ఇంట్లోంచి బయటికి గెంటేసిన నందు.. భర్తని అరెస్టు చేయించిన లాస్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. డబ్బు కోసం సవతి కూతురు జీవితాన్ని తాకట్టు పెట్టిన ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నీకు నిజం తెలిసినా చెప్పడం లేదు అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అంటుంది దివ్య. నువ్వు నన్ను తిట్టుకున్న నేను ఏమీ చెప్పలేను ఎందుకంటే నాకు ఏమీ తెలియదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. నీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయని వెళ్ళిపోతున్నావా అంటుంది దివ్య. మరోవైపు తన గదిలో ఒంటరిగా బాధపడుతున్న తులసి దగ్గరికి వస్తారు అనసూయ దంపతులు.
ఏం కావాలి అత్తయ్య అంటుంది తులసి. నీ కన్నీటికి కారణం కావాలి.. నీ సహనం హద్దు దాటితే తప్పితే నువ్వు అలా ప్రవర్తించవు అంటుంది అనసూయ. కన్నీటికి నాతో చుట్టరికం ఉంది అందుకే అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతుంది అంటుంది తులసి. మాతో చుట్టరికం అంతకన్నా పెద్దది.. నీ కష్టం పంచుకోటానికి ఈ తల్లిదండ్రులకి అర్హత లేదా? నిన్ను ఇబ్బంది పెడితే ఇప్పుడే వెళ్ళిపోతాము అంటాడు పరంధామయ్య.
అప్పుడు తులసి జరిగిందంతా ఆ దంపతులకి చెప్తుంది. విషయం తెలుసుకున్న పరంధామయ్య కోపంతో రగిలిపోతాడు. ఇంత జరిగాక కామ్ గా ఊరుకోవడమేంటి పదా వెళ్లి రాజ్యలక్ష్మి నిలదీద్దాం అంటాడు. అలా చేస్తే మన దివ్య ఇబ్బంది పడుతుంది తను చిక్కుల్లో ఉన్నట్లు తనకి తెలియకూడదు. సమస్యని కాలానికి వదిలేద్దాం అంటుంది తులసి.
దివ్యకి చెప్పకూడదు సరే కానీ నందుకి ఎందుకు చెప్పొద్దు అంటున్నావు అంటుంది అనసూయ. ఇదంతా అనుకోకుండా వింటూ ఉంటాడు నందు. దివ్య జీవితం చిక్కుల్లో ఉందని తెలుసు కానీ అందుకు కారణం లాస్య అని తెలీదు అని మనసులో అనుకుంటాడు. నా ఇప్పటికే దివ్య విషయంలో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిసిందంటే తట్టుకోలేరు.. కుప్పకూలిపోతారు అంటుంది తులసి.
ఆ మాటలు విన్న నందు బాధతో లాస్య దగ్గరికి వెళ్తాడు. తననే చూస్తున్న నందుని ఏంటి అలా చూస్తున్నావు.. తులసి ఇంత అవమానించిన ఎలా సహనంగా ఉన్నాననా? నీ మీద నమ్మకంతోనే నందు. నన్ను అంత అవమానించినందుకు నువ్వు తులసిని ఏదో చేసేస్తావ్ అనుకున్నాను కానీ ఏమీ చేయలేదు అంటూ దొంగ కన్నీరు పెట్టుకుంటుంది తులసి. ఇంతలో రాజ్యలక్ష్మి మేనేజర్ ఫోన్ చేస్తాడు.
అవాక్కైన లాస్య ఫోన్ తీసుకోబోతుంది. కానీ నందు ఆ ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తాడు. రాజ్యలక్ష్మి మేడం మీకు డబ్బు ఇవ్వమన్నారు ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారు అని అడుగుతాడు ఆ మేనేజర్. సమాధానం ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేసి అతను నీకెందుకు డబ్బు ఇస్తున్నాడు, ఏం జరుగుతుంది అని అడుగుతాడు నందు. తప్పుగానే ఇస్తుంది నీకు ఇష్టం లేకపోతే తీసుకొని అంటూ తడబడుతూ చెప్తుంది లాస్య. రాజ్యలక్ష్మి కి దివ్యని అప్పగించినందుకు ఆవిడ నీకు ముట్టచెబుతున్న డబ్బు కదా అంటాడు నందు. అలాంటిదేమీ లేదు అంటుంది లాస్య. నువ్వు రాజ్యలక్ష్మి మాట్లాడుకోవడం తులసి విన్నది అనే విషయం నాకు తెలుసు.
తులసి ఒక్క చెంపే పగలగొట్టింది.. నేను రెండు చెంపలు పగలగొడతాను. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఊరుకున్నాను కానీ నా పిల్లలు జోలికి వచ్చావు. ఇంక నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటాడు నందు. నీకు తులసి మీద మోజు పుట్టి నన్ను వదిలించుకుందామంటే ఊరుకోను.. నేను ఇక్కడి నుంచి కదలను అంటుంది లాస్య. నువ్వు చెప్తే వినే రకానివి కాదు అంటూ లాస్యని చేయి పట్టుకుని బయటికి లాక్కొస్తాడు నందు. నేను చెప్పేది విను.. నేను ఇన్వాల్వ్ కాకపోయినా నీ కూతురు ఆ విక్రమ్ ని ప్రేమించింది కాబట్టి ఈ పెళ్లి జరిగి తీరుతుంది.
అలాంటి చదువు లేనివాడిని అల్లుడుని చేసుకున్నారు అంటే డబ్బు ఉన్న వాళ్ళనే కదా.. మీరు ఆశ పడితే తప్పులేదు కానీ నేను ఆశపడితే తప్పా అంటుంది లాస్య. పగతో రాజ్యలక్ష్మి, దివ్యని కోడలు చేసుకుందని తెలిసి కూడా మాకు చెప్పలేదు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ ఆమెని బయటపెట్టి తలుపేసేస్తాడు నందు. తను మూర్ఖురాలు కానీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించొద్దు అంటుంది అనసూయ.
తన గురించి ఎవరూ బాధపడక్కర్లేదు ఒంటరిగా బ్రతికితే అప్పుడు తెలుస్తుంది అంటాడు నందు. మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే 24 గంటల్లో నా కాళ్లు పట్టుకొని బ్రతిమాలి మరి ఇంట్లోకి తీసుకు వెళ్లే లాగా చేస్తాను అప్పుడు నాతో కాపురం మామూలుగా ఉండదు అంటూ ఛాలెంజ్ చేస్తుంది లాస్య. ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను లోపలికి రానిచ్చేది లేదు ఇది నా చాలెంజ్ అంటాడు నందు. తరువాయి భాగంలో లాస్య గృహహింస చట్టం కింద నందు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు నందు ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.