MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: దివ్యని తలుచుకొని గుండెలు బాదుకుంటున్న నందు.. భార్యని వెనకేసుకొస్తున్న విక్రమ్?

Intinti Gruhalakshmi: దివ్యని తలుచుకొని గుండెలు బాదుకుంటున్న నందు.. భార్యని వెనకేసుకొస్తున్న విక్రమ్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Apr 19 2023, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో నందు ప్రియ అన్న మాటలు తలుచుకుని దివ్య గురించి ఆలోచిస్తూ లోలోపల కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు కారు ఒకచోట ఆపి ఒక దగ్గరికి వెళ్లి నో అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు నందు. దివ్యని తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు నందు. తన కూతురు పరిస్థితి తలుచుకొని కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. మరొకవైపు విక్రమ్ దివ్య ఇంటికి రావడంతో అప్పుడు బసవయ్య అక్క మీ పెద్ద కొడుకు తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకోవచ్చాడు సంతోషమేనా అని అడుగుతాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 అప్పుడు రాజ్యలక్ష్మి వాడు నచ్చిన అమ్మాయిని కాదు నేను మెచ్చిన కోడల్ని తీసుకువచ్చాడు అని అంటుంది. అప్పుడు బసవయ్య అక్క నువ్వు పర్మిషన్ ఇస్తే నేను నా అల్లుడుని ఒక ప్రశ్న అడుగుతాను అని అంటాడు. నా పర్మిషన్ ఎందుకు అడుగు అని అనగా అప్పుడు బసవయ్య విక్రం ని అల్లుడు మీ అమ్మ ఒప్పుకుంది కాబట్టి దివ్యని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు ఒకవేళ మీ అమ్మ ఒప్పుకోకపోయి ఉంటే ఏమి చేసే వాడివి అనడంతో అందరూ బసవయ్య మాటలకు షాక్ అవుతారు. అప్పుడు విక్రమ్ చెప్పడానికి తడబడుతూ ఉండగా ఏంటి అల్లుడు ఆలోచిస్తున్నావు అనగా ఇప్పుడు ఇది అవసరమా మామయ్య అనగా ఇంతలోనే విక్రమ్ వాళ్ళ తాతయ్య నీకు నాకు అవసరం లేకపోవచ్చు ఆయనకు చాలా అవసరం.
 

36

 గుమ్మం దగ్గర అత్త కోడళ్ళ మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసి సంతోషపడతామని చూస్తున్నారు అనడంతో ఇదేంటి బాణం విసిరితే అది వచ్చి మళ్ళీ నాకే గుచ్చుకుంది అనుకుంటూ ఉంటాడు బసవయ్య. తాతయ్య మౌనంగా ఉండండి అనడంతో కాదని మీ అమ్మని చెప్పమను అని అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. అప్పుడు రాజ్యలక్ష్మి దొంగ ప్రేమను కురిపిస్తూ నా బిడ్డలు ఎదురైన నేను కాదనను అంటూ కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మాటలు కూడా ప్రియా వెనకాలే ఉండి వింటూ ఉంటుంది. బుద్ధి తక్కువ ఆ మాట అడిగాను తిరగాల్సిన కార్యక్రమాలు చూద్దాము అని అంటాడు బసవయ్య. అప్పుడు దివ్య విక్రమ్ ఒకరి పేర్లు ఒకరు చెప్పి ఇంట్లోకి వెళ్తారు.

46

అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో  బసవయ్య రాజ్యలక్ష్మి రెచ్చగొడుతూ చూసావా అక్కయ్య అప్పుడే వాడు ఇప్పుడే పెళ్ళాం కొంగు పట్టుకున్నాడు అని అంటాడు. బసవయ్య మాటలకు రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు తులసి ఇంట్లో పంతులుగారు దివ్య విక్రమ్ ల మొదటి రాత్రికి ముహూర్తం పెడుతూ ఉంటారు. అప్పుడు పరందామయ్య జోకులు వేసి అందరిని సరదాగా నవ్విస్తూ ఉంటాడు. అప్పుడు నందు ఎక్కడ అని అనసూయ తులసిని అడగగా నందు భార్యను నేను నన్ను అడగాలి అనగా నువ్వే చెప్పు అనగా ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని అంటుంది లాస్య.
 

56

ఇంతలోనే నందు రావడంతో అక్కడ వాళ్ళని పట్టించుకోకుండా లోపలికి వెళుతుండగా ఏంటి నందు అలా వెళ్ళిపోతున్నావు నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అనగా నాకు రెస్టు కావాలి అనగా అప్పుడే నీ పని అయిపోలేదు ఇంకా చాలా ఉంది అని అంటుంది అనసూయ. అప్పుడే వెళ్ళిపోతే ఎలా ఇంకా కూతురి బాధ్యత ఇంకా తీరలేదు అని అంటుంది. అప్పుడు నందు లోలోపల కుమిలిపోతుండగా తులసి ఏదో జరిగింది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు ఉన్నపలంగా ఒక్కసారి కళ్ళు తిరిగి కిందపడిపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు పంతులుగారు ఈరోజు రాత్రికి మంచి ముహూర్తం ఉంది అనడంతో ఇంకెందుకు ఆలస్యం కానీచేద్దాం అని అంటుంది లాస్య.
 

66

అప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడించినా కూడా నందు మాత్రం లోలోపల ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడితే బాగోదు ఇంటికి వెళ్లి మాట్లాడొద్దామో బయలుదేరుదామా అనగా నందు సరే అని అంటాడు. మరొకవైపు దివ్య విక్రమ్ ఇద్దరు కలిసి దివ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగా అప్పుడు దివ్య పక్కనే ఉన్న కిటికీలను ఓపెన్ చేస్తుంది. నాన్న నీ కోడలు దివ్య అనగా దివ్య ను చూసి సంతోషపడుతూ ఉంటాడు విక్రమ్ వాళ్ళ నాన్న. అప్పుడు విక్రమ్ వాళ్ళ నాన్నను చూసి దివ్య ఈ మధ్యకాలంలో మా నాన్నను ఎప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు నాన్న నీ కోడలు నచ్చిందా అనగా నచ్చింది అన్నట్టు తల ఊపుతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Recommended image2
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Recommended image3
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved