MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: లాస్యతో ఛాలెంజ్ చేసి జైలుకు వెళ్లిన నందు.. అత్తను లెక్కచేయని దివ్య?

Intinti Gruhalakshmi: లాస్యతో ఛాలెంజ్ చేసి జైలుకు వెళ్లిన నందు.. అత్తను లెక్కచేయని దివ్య?

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అన్యాయంగా తన భర్తని జైలు పాలు చేసిన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 31 2023, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో ఈ పువ్వుని నా మీద ప్రేమతో ఇచ్చావనుకున్నాను కానీ అమ్మ మీద ప్రేమతో ఇచ్చావా అంటూ ఆ పువ్వుని తిరిగి ఇచ్చేస్తుంది దివ్య. ఈ రెండింటికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు అంటాడు విక్రమ్. భార్యాభర్తల అనురాగం మధ్య మరొక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. నీ ప్రేమని మీ అమ్మగారు గైడ్ చేయకూడదు. అది ఏ భార్య సహించలేదు భార్యని అర్థం చేసుకో అంటుంది దివ్య.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అందుకు సరే అంటాడు విక్రమ్. మీ అమ్మగారు నడుస్తున్నారు కదా ఇప్పుడైనా కోర్టుకు వెళ్లొచ్చా అంటుంది దివ్య. ఆ మాట నేనే చెప్పాలనుకుంటున్నాను పదా వెళ్దాం అంటాడు విక్రమ్. మరోవైపు కోర్ట్ కి బయలుదేరుతారు నందు, తులసి. అప్పటికే కారు దగ్గర ఉన్న లాస్య ని చూసి షాకవుతారు. కొత్తగా పెళ్లయిన మొగుడు పెళ్లాల్లాగా బాగానే వస్తున్నారు. కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది లాస్య.
 

39

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇప్పటికీ మనిద్దరం భార్యాభర్తలమే. మనం మాట్లాడుకోవాల్సిన ఊసులు చాలా ఉన్నాయి. పెళ్లిలో ఇలాగే అగ్నిహోత్రం చుట్టూ కలిసి నడిచాము కలిసి రాలేనట్లుగా ఉంది ఇప్పుడు కోర్టుకి కలిసి వెళ్తున్నాము. ఇప్పటికైనా మించి పోయింది లేదు వెనక సీట్లో కూర్చొని కోర్టుకి వెళ్లే లోపు బాగా ఆలోచించు అంటుంది లాస్య. కారు తాళాలు లాస్య చేతిలో పెడతాడు నందు. లాస్య కారు డ్రైవ్ చేస్తూ నేనేమీ కావాలని డ్రైవింగ్ సీట్లో కూర్చోలేదు అంటుంది.
 

49

తెలుసు నందగోపాల్ గారు డ్రైవ్ చేస్తే ఎక్కడ నేను ఆయన పక్కన కూర్చుంటానో అని స్టీరింగ్ని చేతిలోకి తెచ్చుకున్నావు అంటుంది తులసి. బాగానే గెస్ చేసావు అంటుంది లాస్య. పెళ్ళికి ముందు నీ వలన పడిన కష్టాలు చెప్పుకొని ఈ భుజం మీదే ఏడ్చేవాడు నందు. నేనే ఓదార్చే దానిని అని తులసికి చెప్తుంది లాస్య. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు అంటుంది తులసి. ఒకప్పుడు నిప్పు ఉప్పు లాగా ఉండే మీరిద్దరూ కలిసిపోయారు.

59

నేను చేసిన తప్పులు కూడా మర్చిపోయి ఇలాగే కలిసుందాం అంటే నందు ఒప్పుకోవటం లేదు అంటుంది లాస్య. నువ్వు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటి దానివి. నిన్ను పక్కన పెట్టుకుంటే నాకే ప్రమాదం అంటాడు నందు. మరి తులసి ఏంటి అని అడుగుతుంది లాస్య. తను అమృతం. మంచి చేసిన వాళ్ళకైనా చెడు చేసిన వాళ్లకైనా అమృతం మంచినే చేస్తుంది అంటాడు నందు. చూస్తాను ఈ అమృతం నీకు ఎంత మంచి చేస్తుందో అంటుంది లాస్య.
 

69

ఇంతలో కోర్టు రావడంతో గబగబా కారు దిగి వెళ్ళిపోతాడు నందు. నేను నందు తో కలిసి ఉండటం కోసం అడుగులు ముందుకు వేస్తుంటే అతను మాత్రం అడుగులు వెనక్కి వేస్తున్నాడు అని తులసి తో చెప్తుంది లాస్య. నేను మారాను మారుతున్నాను అని చెప్తున్నావు కానీ నువ్వు ఎప్పటికీ రాజ్యలక్ష్మి మనిషివే అలాంటప్పుడు నిన్ను నందగోపాల్ గారు ఎలా నమ్ముతారు అంటుంది తులసి. నమ్మకపోతే మీకే  నష్టం నా దగ్గర ఉన్న వీడియోతో నందుని జైలు పాలు చేస్తాను అంటుంది లాస్య. ఏది చూపించు అంటుంది తులసి.
 

79

వీడియో చూపించడం కోసం తన ఫోన్లో సెర్చ్ చేస్తుంది లాస్య అందులో వీడియో కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. నీ వీడియో కథ కంచికి చేరినట్లే ఇప్పుడు మన స్కోర్ సమానం. నువ్వు నందగోపాల్ గారిని ఏమి చేయలేవు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. కోర్టులో నందు తరుపున సాక్ష్యాలు అడుగుతాడు జడ్జి. మా వైపు న్యాయం ఉన్నా సాక్షాలు లేవు అంటాడు మాధవి భర్త. లాస్య తరపు సాక్ష్యాలు అడుగుతాడు జడ్జి.
 

89

వీడియో సాక్ష్యంగా చూపిస్తుంది లాస్య. తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీడియో చూసిన జడ్జి నందగోపాల్ కి ఐదు సంవత్సరాల జైలు శిక్ష వేస్తాడు. నందుని కోర్టుకి తీసుకు వెళ్తుంటే దివ్య తండ్రిని హత్తుకుని ఏడుస్తుంది. మీ అమ్మకు చేసిన అన్యాయానికి శిక్షణ అనుభవిస్తున్నాను కూతుర్ని అల్లుడికి అప్పగించి తండ్రి లేని లోటు లేకుండా చూసుకోమని చెప్తాడు నందు. లాస్య, తులసి దగ్గరికి వెళ్లి నేను బిస్కెట్ ముక్క వేస్తేనే పడిపోయే భాగ్యం నువ్వు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే పడిపోదని నాకు తెలియదా అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అంటుంది.
 

99

నందు దగ్గరికి వెళ్లి నిన్ను జైలు పాలు చేయాలని నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకో నీ బ్రతుకు మారుస్తాను అంటూ నందుని హత్తుకోబోతుంది లాస్య. ఆమెని వదిలించుకొని జైలు నుంచి రాగానే నేను నీ బ్రతుకుని మారుస్తాను డైవర్స్ కి సిద్ధంగా ఉండు అని హెచ్చరించి వెళ్లిపోతాడు నందు. తరువాయి భాగంలో తండ్రిని చూడటానికి బయలుదేరుతుంది దివ్య. వెళ్లడానికి వీల్లేదు అంటుంది రాజ్యలక్ష్మి. వెళ్లి తీరుతాను నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది దివ్య.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved