- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: సూపర్ ట్విస్ట్.. నందును హింసిస్తున్న లాస్య.. కొడుకును బయటకు తరిమెసిన తులసి!
Intinti Gruhalakshmi: సూపర్ ట్విస్ట్.. నందును హింసిస్తున్న లాస్య.. కొడుకును బయటకు తరిమెసిన తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 21 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నందు (Nandu) శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం చేద్దాం త్వరగా ఫ్రెష్ ఐయి రా అని లాస్య (Lasya) తో అంటాడు. దాంతో లాస్య నాకు ఆఫీసులో చాలా పని ఉందని నందు మాట కొట్టిపారేసి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో కోపం గా నందు ఆ పూలు పక్కన విసిరేస్తాడు.
ఆ తర్వాత తులసి (Tulasi) తన కొడుకు పడుకొని ఉండగా నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టి చాలా మంచి పని చేశావు అని అంటుంది. ఈ లోపు అభి (Abhi) నిద్ర లేవగా త్వరగా రా నీకు నలుగు పెట్టి తలంటి స్నానం పోస్తాను అని అంటుంది. దాంతో అభి సరే అమ్మ అని ఆనందంగా ఉంటాడు.
ఇక ఈ క్రమంలో ఫ్యామిలీ అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక అంకిత (Ankitha) కూడా చాలా ఆనంద పడుతుంది. అంతేకాకుండా తన కొడుకుకి తానే తల దువ్వుతుంది తులసి. ఇక ఈ రోజు శ్రీరామనవమి వీడు నా అభిరాముడు అని తులసి (Tulasi) అంటుంది. ఈలోగా అక్కడకు పరంధామయ్య వచ్చి వనవాసానికి వెళ్ళవలసి వస్తుందేమో చూడు మనవడా అంటాడు.
దాంతో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. ఇక తులసి మీరు ఏ ఉద్దేశంతో అన్న జరగాల్సిందే జరగక మానదు మామయ్యని అంటుంది. అంతేకాకుండా పూజ ప్రారంభిద్దాం అని చెప్పి అభి (Abhi) అంకిత లతో సీతారాముల కళ్యాణం జరుపుతుంది. ఇక పూజలో దివ్య (Divya) ఊరికే అన్నయ్య వైపే చూస్తున్నావు కాస్త నా వైపు కూడా చూడు అంటుంది.
మరోవైపు ప్రేమ్ (Prem), శృతి లు ఆనందంగా సీతారాముల కళ్యాణం లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు అని శృతి (Sruthi) అంటుంది. అదే క్రమంలో ప్రేమ్ రాముడు లాగా నేను అమ్మ మాటకు కట్టుబడి ఇంటి నుంచి బయటకు వచ్చాను అని అంటాడు.
ఇక తరువాయి భాగం లో అంకిత (Ankitha) వాళ్ళ అమ్మ వచ్చి నా కూతుర్ని నా అల్లుడ్ని తులసి నాతో పంపడానికి ఒప్పుకుంది అని అంటుంది. దాంతో దివ్య (Divya) ఒక్కసారిగా కంట కన్నీరు పెడుతుంది. ఇక ఒకవైపు అంకిత నాకు మా అమ్మతో వెళ్లడం ఇష్టమే కానీ అని ఎదో చెప్ప బోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.