- Home
- Entertainment
- చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు, అడ్రెస్ లేకుండా పోయారు.. పద్మభూషణ్ సన్మాన సభలో బాలయ్య
చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు, అడ్రెస్ లేకుండా పోయారు.. పద్మభూషణ్ సన్మాన సభలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా బాలయ్య 50 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు.

Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా బాలయ్య 50 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్యం అందిస్తున్నారు. బాలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ని అందించింది.
Nandamuri Balakrishna
బాలయ్య ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంతో హిందూపురంలో అభిమానులు సన్మాన సభని ఏర్పాటు చేశారు. వరుసగా మూడోసారి బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సభలో బాలయ్య మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది నాకు పద్మభూషణ్ అవార్డు ఆలస్యంగా వచ్చింది అని అంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం సరైన టైంలో వచ్చింది. హిందూపురం కి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నటుడిగా వరుసగా నాలుగు సూపర్ హిట్ లు కొట్టాను.
Nandamuri Balakrishna
పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది అని బాలయ్య అన్నారు. మొదట నాన్నగారు ఆ తర్వాత అన్నయ్య హరికృష్ణ గారు హిందూపురంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అదృష్టం నాకు దక్కింది. నా నిజాయితీ, కల్మషం లేని మనస్తత్వం చూసే మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోదు.. ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ వచ్చాను. అందుకే మూడోసారి గెలవగలిగాను.
Nandamuri Balakrishna
నటుడిని అయినంత మాత్రాన ఎమ్మెల్యే కావాలని లేదు. చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల విషయానికి వస్తే నాన్నగారు చేయలేని గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలు కూడా చేశాను.
Nandamuri Balakrishna
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుసగా నాలుగు ఫీట్లు దక్కాయి. చాలామంది బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది అంటున్నారు. సినిమాల్లో 50 ఏళ్ల పాటు నాలాగా హీరోగా ఉన్నవారు ఇంకెవరూ లేరు. ఇకపై నా సినిమాలతో నేనేంటో చూపిస్తా. మీ అంచనాలకు కూడా అందని సినిమాలు చేస్తా అంటూ బాలయ్య ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచారు.