Republic Day Celebrations: గణతంత్ర వేడుకల్లో బాలయ్య.. అందరినీ ప్రేమగా పలకరిస్తూ..
రాజకీయ నాయకులతో పాటు.. సినిమా సెలబ్రిటీలు..గణతంత్ర వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. నటసింహం బాలకృష్ణ(Balakrishna) బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో రిపబ్లిక్ డే ను సెలబ్రేట్ చేశారు.

73వ గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటన్నారు. కోవిడ్ దృశ్య.. ఇంతకు ముందులా.. కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ.. రిపబ్లిక్ డేను జరుపుకుంటున్నారు. అందులో రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. నటి సింహం బాలకృష్ణ (Balakrishna) రిపబ్లిక్ డేను బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో సెలబ్రేట్ చేశారు.
దేశ ప్రజలకు 73వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు బాలయ్య బాబు(Balakrishna). ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని కాన్సర్ హాస్పిటల్ కు వెళ్ళిన బాలకృష్ణ అక్కడే జాతీయ జెండాను ఆవిష్కరించారు. మూడు రంగుల బెలూన్లను గాలిలోకి వదిలిన బాలకృష్ణ(Balakrishna). అక్కడ ఉన్నవారందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఆస్పిటల్ ఆవణలో ఉన్న ఎన్టీఆర్- బసవతారకమ్మ విగ్రహాలకు నివాళి అర్పించారు బాలయ్య బాబు(Balakrishna). అక్కడే కొద్ది సేపు గడిపారు. అక్కడ ఉన్న స్టాఫ్ తో కలిసి పోయి మాట్లాడిన బాలకృష్ణ(Balakrishna). హాస్పిటల్ లో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
హాస్పిటల్ లో చాలా సేపు గడిపారు బాలయ్య బాబు(Balakrishna). అక్కడ ఉన్న జనాతతో పాటు స్టాఫ్ తో కూడా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బాలయ్య. ఆవరణలో ఉన్నరోగులను పలుకరించి.. వారికి అందుతున్న ట్రీట్మెంట్ గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
బాలయ్య(Balakrishna) బాబు రావడంతో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ జెండా ఎగరేసిన బాలయ్య.. కొద్ది సేపు మాట్లాడారు. తమ అభిమాన నటుడు కనిపించడంతో ఫ్యాస్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ లాంటి స్టార్స్ కూడా ఈరోజు గణతంత్ర వేడుకలను నిర్వహించారు.