- Home
- Sports
- Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య
Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య
అఖండ మొదటి భాగంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మరి అఖండ 2లో ఆమెని ఎందుకు పక్కన పెట్టారో తెలుసా ? దీనిపై బాలయ్య వివరణ ఇస్తూ షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేశారు.

నందమూరి బాలకృష్ణ అఖండ 2
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి ఇది సీక్వెల్.. పైగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్లు దుమ్ము లేచిపోవడం ఖాయం అన్నట్లుగా ఉంది పరిస్థితి.
హీరోయిన్ గా సంయుక్త మీనన్
ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. అఖండ మొదటి భాగంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. ఆమెని ఈ చిత్రంలో ఎందుకు కొనసాగించలేదు అనే ప్రశ్న మొదలైంది. దీనితో బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర గురించి చెబుతూ.. స్టోరీ గురించి హింట్ ఇచ్చారు. అసలు అఖండ 2 కథ ఎలా మొదలవుతుందో రివీల్ చేశారు. ఈ క్రమంలో ఒక ట్విస్ట్ కూడా బయట పెట్టారు.
కథ మొదలయ్యేది ఎలా అంటే..
అఖండ చిత్రానికి సీక్వెల్ చేయాలి అనుకున్నప్పుడు కథ ఎలా మొదలు పెట్టాలి అనే ప్రశ్న వచ్చింది. అఖండ చివర్లో పాపకి హామీ ఇచ్చే సీన్ ఉంటుంది. అవసరమైనప్పుడు నన్ను తలుచుకుంటే నీ ముందు ప్రత్యక్షమవుతా అని పాపకి అఖండ చెబుతాడు. ఆ పాప పాత్రని ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా పోషించింది . ఆమె భజరంగీ భాయీజాన్ చిత్రంలో చిన్నారిగా నటించిన సంగతి తెలిసిందే.
ప్రగ్యా జైస్వాల్ పాత్రపై క్లారిటీ
తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ పాప పాత్రతో మొదలు పెడితే కథ మొత్తం అద్భుతంగా వచ్చింది. ప్రగ్యా జైస్వాల్ మొదటి భాగంలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర రెండవ భాగంలో ఉంటే ఏం చేస్తుంది ? అసలు కథకి ఆమె పాత్ర అవసరం లేదు అని అనిపించింది. అందుకే అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ పాత్ర చనిపోయినట్లు చూపించాం అని బాలయ్య ట్విస్ట్ రివీల్ చేశారు.
పాన్ ఇండియా రిలీజ్
ఈ మూవీలో యాక్షన్ సీన్లపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలిసారి బాలయ్య చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. మరి బాలయ్య ఎలాంటి విజయం దక్కించుకుంటారో చూడాలి.

