- Home
- Entertainment
- బాలయ్య స్టార్ అయ్యాక ఒక్క ఫైట్ కూడా లేకుండా చేసిన చిత్రం, ఆ డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
బాలయ్య స్టార్ అయ్యాక ఒక్క ఫైట్ కూడా లేకుండా చేసిన చిత్రం, ఆ డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
నందమూరి బాలకృష్ణ మొదట తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో నటిస్తూ ఎదిగారు. ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తూ నటనలో సత్తా చాటారు. నెమ్మదిగా బాలయ్యకి మాస్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది.

Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ మొదట తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో నటిస్తూ ఎదిగారు. ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తూ నటనలో సత్తా చాటారు. నెమ్మదిగా బాలయ్యకి మాస్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. బాలయ్య సినిమా అంటే అదిరిపోయే ఫైట్లు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఒక డైరెక్టర్ మాత్రం బాలయ్యతో ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్యతో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు.
బాలయ్యకి స్టార్ ఇమేజ్ వచ్చాక అలాంటి సాహసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. కోదండరామిరెడ్డి. ఆయన సాఫ్ట్ చిత్రాలు చేసే దర్శకుడు కాదు. కానీ బాలయ్యతో ఒక్క ఫైట్ కూడా లేకుండా నారీ నారీ నడుమ మురారి అనే చిత్రం తెరకెక్కించి విజయం సాధించారు.
Nandamuri Balakrishna
ఈ చిత్రం గురించి కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది బాలయ్య 50 చిత్రం. బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అసలు ఏ ధైర్యంతో బాలయ్యతో అలాంటి చిత్రం చేశారు అని ప్రశ్నించగా కోదండ రామిరెడ్డి సమాధానం ఇచ్చారు. కోదండరామిరెడ్డి నవ్వుతూ.. అప్పటి వరకు నేను యాక్షన్ సినిమాలు చేశాను.
Nandamuri Balakrishna
ఈసారి బాలయ్యతో కంప్లీట్ గా రొమాంటిక్ గా, కామెడీగా ఒక చిత్రం చేయాలని అనుకున్నా. అందుకే ఇద్దరు హీరోయిన్లు ఉండే సబ్జెక్టు ఎంచుకున్నాం. బాలయ్య ఓకె చేశారు. మేము మెయిన్ గా ఫోకస్ చేసింది సాంగ్స్ పైనే.. సాంగ్స్ అద్భుతంగా వచ్చేలా చూసుకున్నాము. ఫలితంగా ఒక్క ఫైట్ కూడా లేకపోయినప్పటికీ సినిమా సూపర్ హిట్ అయింది అని కోదండరామిరెడ్డి అన్నారు.
Nandamuri Balakrishna
ఈ చిత్రంలో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. శారద, కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. బాలయ్య, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ముద్దుల మొగుడు, బొబ్బిలి సింహం, భార్గవ రాముడు లాంటి చిత్రాలు తెరకెక్కాయి.