MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
  • Home
  • Entertainment
  • Balakrishna: షూటింగ్ లో ప్రమాదం, బాలయ్యకు గాయాలు, ఆందోళనలో అభిమానులు..

Balakrishna: షూటింగ్ లో ప్రమాదం, బాలయ్యకు గాయాలు, ఆందోళనలో అభిమానులు..

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణకు గాయాలు అయ్యాయి, షూటింగ్ లో ఓ ప్రమాదంలో ఆయనకు దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం బాలయ్యకు ఎలా ఉంది?

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 21 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నందమూరి బాలకృష్ణకు గాయాలు
Image Credit : Asianet News

నందమూరి బాలకృష్ణకు గాయాలు

నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే గుర్తొచ్చేది.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్.. ఒళ్లు గగుర్పొడిచే రోమాంచిత పోరాటాలు. ఆరు పదుల వయసు దాటినా కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడరు. అయితే, ఈ సాహసాలే కొన్నిసార్లు ఆయనకు గాయాలయ్యేందుకు కారణమవుతున్నాయి. తాజాగా మరోసారి బాలయ్య గాయాలపాలు అయినట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
షూటింగ్ లొకేషన్‌లో అసలేం జరిగింది?
Image Credit : Asianet News

షూటింగ్ లొకేషన్‌లో అసలేం జరిగింది?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 111వ చిత్రం (#NBK111) షూటింగ్ బిజీలో బాలకృష్ణ ఉన్నారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. నటుడు మంచు మనోజ్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ కాలు జారడం లేదా మెలిక పడటంతో కిందపడిపోయారు. దీనివల్ల ఆయన మోకాలి భాగంలో దెబ్బతగిలి నొప్పితో బాధపడ్డారు.

Related Articles

Related image1
National Awards: అత్యధిక నేషనల్ అవార్డులు గెలిచిన 9 మంది స్టార్స్ వీళ్లే.. టాప్‌లో మన సౌత్ యాక్టర్
Related image2
School: ఫారెన్ స్కూల్స్ లో పిల్లలను కొడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా? తల్లిదండ్రులకు కూడా తప్పదా?
34
ఆందోళనలో అభిమానుల, డాక్టర్లు ఏమంటున్నారంటే?
Image Credit : Asianet News

ఆందోళనలో అభిమానుల, డాక్టర్లు ఏమంటున్నారంటే?

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన మూవీ టీమ్ చిత్రీకరణను నిలిపివేసి, ఆయనను తక్షణమే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైన స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ ఘటనపై వైద్య బృందం స్పందిస్తూ —  పూర్తిగా - త్వరగా కోలుకునేందుకు బాలకృష్ణకు చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ చికిత్స ఆయన త్వరగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక సమస్యలేవీ లేకుండా తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

44
గతంలోనూ భుజం గాయాలు
Image Credit : our own

గతంలోనూ భుజం గాయాలు

బాలకృష్ణకు యాక్షన్ సీన్స్‌లో గాయపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'అఖండ' సినిమా చిత్రీకరణ సమయంలోనూ ఆయన ఎడమ భుజం కండరాల గాయంతో (Rotator cuff tear) బాధపడ్డారు. తీవ్రమైన నొప్పితోనే.. చేతికి బ్యాండ్ వేసుకుని టాక్ షోలు, షూటింగ్‌లలో పాల్గొన్నప్పటికీ, ఆ తర్వాత హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
National Awards: అత్యధిక నేషనల్ అవార్డులు గెలిచిన 9 మంది స్టార్స్ వీళ్లే.. టాప్‌లో మన సౌత్ యాక్టర్
Recommended image2
School: ఫారెన్ స్కూల్స్ లో పిల్లలను కొడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా? తల్లిదండ్రులకు కూడా తప్పదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved