MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • National Awards: అత్యధిక నేషనల్ అవార్డులు గెలిచిన 9 మంది స్టార్స్ వీళ్లే.. టాప్‌లో మన సౌత్ యాక్టర్

National Awards: అత్యధిక నేషనల్ అవార్డులు గెలిచిన 9 మంది స్టార్స్ వీళ్లే.. టాప్‌లో మన సౌత్ యాక్టర్

National Awards: భారతీయ సినిమాలో అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న 9 మంది గొప్ప నటుల గురించి మీకు తెలుసా? ఈ లిస్ట్‌లో బాలీవుడ్ దిగ్గజాలతో పాటు సౌత్ ఇండియా నుంచి ప్రకాష్ రాజ్ కూడా టాప్ పొజిషన్‌లో ఉండటం విశేషం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 19 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జాతీయ అవార్డులను కొల్లగొట్టిన ఆ 9 మంది స్టార్స్
Image Credit : Asianet News

జాతీయ అవార్డులను కొల్లగొట్టిన ఆ 9 మంది స్టార్స్

భారతీయ సినిమా రంగంలో ప్రతి నటీనటులకు, టెక్నీషియన్‌కు నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకోవాలనేది జీవితాంతం గుర్తుండిపోయే కల. అయితే, కొందరు నటులు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు, ఆరుసార్లు ఈ  అవార్డును గెలుచుకున్నారు. నటనకే కాకుండా, సినిమా నిర్మాణానికి కూడా జాతీయ అవార్డులు అందుకున్న ఆ 9 మంది స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్‌లో మనందరికీ తెలిసిన, మన తెలుగులో కూడా నటించిన ప్రకాష్ రాజ్ టాప్ 3లో ఉండటం విశేషం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమితాబ్ బచ్చన్ - షబానా అజ్మీ
Image Credit : Asianet News

అమితాబ్ బచ్చన్ - షబానా అజ్మీ

ఈ లిస్ట్‌లో మొదటి స్థానం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌దే. 'సాత్ హిందుస్తానీ' (తొలి చిత్రం), 'అగ్నిపథ్', 'బ్లాక్', 'పా' (నటుడు, నిర్మాతగా), 'పీకు' చిత్రాలకు గాను మొత్తం 6 జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈయనకు దేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది.

భారతదేశంలోని గొప్ప నటీమణులలో ఒకరైన షబానా అజ్మీ.. 'అంకుర్', 'అర్థ్', 'ఖాందర్', 'పార్', 'గాడ్‌మదర్' చిత్రాల్లో తన అద్భుత నటనకు 5 సార్లు 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించారు.

36
మన ప్రకాష్ రాజ్! (5 అవార్డులు)
Image Credit : Asianet News

మన ప్రకాష్ రాజ్! (5 అవార్డులు)

బెంగళూరులో పుట్టి పెరిగి, నాటకరంగం నుంచి వచ్చి బహుభాషా నటుడిగా ఎదిగిన ప్రకాష్ రాజ్ మొత్తం 5 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఉత్తమ చిత్ర నిర్మాతగా కూడా ఆయన అవార్డు అందుకోవడం గమనార్హం.

పుట్టక్కన హైవే (2010, కన్నడ) - ఉత్తమ కన్నడ చిత్రం (నిర్మాతగా)

ఇరువర్ (1997, తమిళం) - ఉత్తమ సహాయ నటుడు

అంతఃపురం (1998, తెలుగు) - ప్రత్యేక ప్రశంస (Special Mention)

ధయా (2002, తమిళం) - స్పెషల్ జ్యూరీ అవార్డు

కంచివరం (2007, తమిళం) - ఉత్తమ నటుడు

46
కమల్ హాసన్‌ -ధనుష్
Image Credit : Asianet News

కమల్ హాసన్‌ -ధనుష్

తమిళ 'విశ్వనాయకుడు' కమల్ హాసన్ బాలనటుడిగా ఒక అవార్డు, 'మూండ్రమ్ పిరై' (వసంత కోకిల), 'నాయకన్' (నాయకుడు), 'ఇండియన్' (భారతీయుడు) చిత్రాలకు ఉత్తమ నటుడిగా, 'తేవర్ మగన్' (క్షత్రియ పుత్రుడు) చిత్రానికి నిర్మాతగా మొత్తం 5 అవార్డులు గెలుచుకున్నారు.

తమిళ వర్సటైల్ స్టార్ ధనుష్.. 'ఆడుకళం' (పందెం కోళ్లు), 'అసురన్' చిత్రాలకు ఉత్తమ నటుడిగా, 'కాక ముట్టై', 'విసారణై' చిత్రాలకు సహ-నిర్మాతగా మొత్తం 4 అవార్డులు తన ఖాతాలో వేసుకున్నారు.

56
మోహన్‌లాల్ - మమ్ముట్టి
Image Credit : Anto Joseph Film Company

మోహన్‌లాల్ - మమ్ముట్టి

మలయాళ చిత్రసీమ 'కంప్లీట్ యాక్టర్' మోహన్‌లాల్.. 'కిరీడం', 'భారతం', 'వానప్రస్థం' (నటుడు, నిర్మాతగా) చిత్రాలతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డుతో కలిపి మొత్తం 5 జాతీయ అవార్డులు అందుకున్నారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. 'ఒరు వడక్కన్ వీరగాథ', 'విధేయన్', 'డా. అంబేద్కర్', ఇటీవల వచ్చిన 'భ్రమయుగం' చిత్రాల్లోని నటనకు గాను 4 సార్లు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు.

66
అజయ్ దేవగన్ - కంగనా రనౌత్
Image Credit : Asianet News

అజయ్ దేవగన్ - కంగనా రనౌత్

బాలీవుడ్ 'సింగం' అజయ్ దేవగన్.. 'జఖ్మ్', 'ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్', 'తానాజీ' (నటుడు, నిర్మాతగా) చిత్రాలకు గాను 4 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.

ఈ జాబితాలో ఉన్న మరో నటి కంగనా. 'ఫ్యాషన్' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా, 'క్వీన్', 'తను వెడ్స్ మను రిటర్న్స్', 'మణికర్ణిక & పంగా' చిత్రాల్లోని నటనకు గాను మొత్తం 4 జాతీయ అవార్డులు అందుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Related Stories
Recommended image1
Trash On Roads: అమెరికా రోడ్లపై చెత్త వేస్తే ఎంత పెద్ద నేరమో తెలుసా? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయంటే?
Recommended image2
Sai Pallavi: సీత పాత్ర చేయాలంటే సాయి పల్లవి ఎంత భయపడిందో తెలుసా? చివరకు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved