- Home
- Entertainment
- నందమూరి ఫ్యాన్స్ కి పండగే, డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బుల్లితెరపై దబిడి దిబిడే
నందమూరి ఫ్యాన్స్ కి పండగే, డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బుల్లితెరపై దబిడి దిబిడే
Daaku Maharaaj OTT release: నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో వచ్చారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తమన్ ఇచ్చిన సాలిడ్ బిజియం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది.

Daaku Maharaaj
నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో వచ్చారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తమన్ ఇచ్చిన సాలిడ్ బిజియం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇక ఊర్వశి రౌతేలా చిన్న పాత్రతో పాటు ఆమె నటించిన దబిడి దిబిడి ఐటెం సాంగ్ హైలైట్ గా నిలిచింది.
శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించారు. ఎట్టకేలకు ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 21 నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు.
ఇకపై ఈ చిత్రం ఇంట్లోనే బుల్లితెరపై దబిడి దిబిడి అంటూ మోత మోగించబోతోంది. బాలయ్య ఖాతాలో డాకు మహారాజ్ చిత్రం వరుసగా నాల్గవ విజయం. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల తర్వాత బాలయ్య ఖాతాలో డాకు మహారాజ్ మరో హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం రిలీజై ఘనవిజయం సాధించడం, కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడం జరిగింది. డాకు మహారాజ్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.