- Home
- Entertainment
- సినిమా ఇక బ్లాక్ బస్టర్ అవుతుంది అనగా ముంచేసిన చిరంజీవి.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ
సినిమా ఇక బ్లాక్ బస్టర్ అవుతుంది అనగా ముంచేసిన చిరంజీవి.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ
రవితేజని అభిమానులు ముద్దుగా పిలుచుకునేది మాస్ మహారాజ్ అని. అలాంటి మాస్ మహారాజ్ క్లాస్ సినిమా చేయడం అంటే పెద్ద రిస్క్. కానీ కథ నచ్చితే రవితేజ అప్పుడప్పుడూ రిస్క్ లు చేస్తుంటాడు.

రవితేజని అభిమానులు ముద్దుగా పిలుచుకునేది మాస్ మహారాజ్ అని. అలాంటి మాస్ మహారాజ్ క్లాస్ సినిమా చేయడం అంటే పెద్ద రిస్క్. కానీ కథ నచ్చితే రవితేజ అప్పుడప్పుడూ రిస్క్ లు చేస్తుంటాడు. రవితేజతో బెల్లంకొండ సురేష్ నిర్మించిన రెండు చిత్రాలు నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో రవితేజ ఇమేజ్ కి భిన్నమైన చిత్రాలే.
వీటిలో నా ఆటోగ్రాఫ్ చిత్రం క్లాసిక్ మూవీగా ప్రశంసలు దక్కించుకుంది కానీ.. కమర్షియల్ గా ఫ్లాప్ మూవీ. బెల్లంకొండ సురేష్ ఈ చిత్ర ఫ్లాప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం ఫ్లాప్ కి ప్రధాన కారణం రాంగ్ కాస్టింగ్. రవితేజతో చేయాల్సిన సినిమా కాదు అది. రవితేజ కంప్లీట్ మాస్ హీరో. ఇది మాత్రం కంప్లీట్ క్లాస్ కథ. కాబట్టి సెట్ కాలేదు. తమిళంలో ఆటోగ్రాఫ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.
బెల్లంకొండ సురేష్ ఆటోగ్రాఫ్ చిత్ర ఫస్ట్ హాఫ్ చూడగానే దీనిని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారట. తెలుగు వర్షన్ లో ఎలాంటి లోపం లేదు. సినిమా అద్భుతంగ ఉంటుంది. చంద్రబోస్ అందించిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ రవితేజ మాస్ ఇమేజ్ కి ఈ చిత్రం సరిపడలేదు. మరి కొన్ని కారణాల వల్ల మూవీ ఫ్లాప్ అయింది అని బెల్లంకొండ సురేష్ అన్నారు.
మరొక ప్రధాన కారణం నా ఆటోగ్రాఫ్ రిలీజ్ అయిన 4 రోజులకి మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ రిలీజ్ అయింది. నా ఆటోగ్రాఫ్ చిత్రానికి తొలి రోజు మంచి టాక్ రాలేదు. ఆ తర్వాత రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ మొదలైంది. నెమ్మదిగా సినిమా బ్లాక్ బస్టర్ వైపు వెళుతుంది అనగా.. చిరంజీవి శంకర్ దాదా చిత్రం పిడుగులా వచ్చి పడింది.
Also Read : హీరోలని డామినేట్ చేసే హీరోయిన్, ఆమెతో నటించాలంటే భయం..చైతు కామెంట్స్, సమంత మాత్రం కాదు
దీనితో థియేటర్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఫలితంగా నా ఆటోగ్రామ్ చిత్రం ఇక కోలుకోలేదు అని బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఒక కుర్రాడి జీవితంలో మూడు దశలలో ఎదురయ్యే అనుభవాలు, ప్రేమలు, కష్టాలని దర్శకుడు ఎంతో ఎమోషల్ గా చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్స్ లో నిరాశ పరిచింది కానీ ఆ తర్వాత టీవీల్లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. శంకర్ దాదా చిత్రానికి, నా ఆటోగ్రాఫ్ చిత్రానికి కనీసం రెండు వారాల గ్యాప్ ఉండి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది అని సురేష్ తెలిపారు.