MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడ్డ చిత్రం, అట్టర్ ఫ్లాప్ అయ్యే మూవీకి ఎందుకింత హంగామా అంటూ బాలయ్య ఆగ్రహం

ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడ్డ చిత్రం, అట్టర్ ఫ్లాప్ అయ్యే మూవీకి ఎందుకింత హంగామా అంటూ బాలయ్య ఆగ్రహం

బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగే వరకు ఆయన చిత్రాల కథలని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంపిక చేసేవారు. ఆయన ఫైనల్ చేసిన చిత్రాల్లోనే బాలయ్య నటించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ ఎంపిక చేసిన చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ లెక్క తప్పింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 27 2025, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణకి ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. అలా మాట్లాడడం కొన్నిసార్లు వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగే వరకు ఆయన చిత్రాల కథలని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంపిక చేసేవారు. ఆయన ఫైనల్ చేసిన చిత్రాల్లోనే బాలయ్య నటించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ ఎంపిక చేసిన చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కానీ ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ లెక్క తప్పింది. ఆ చిత్రం పేరు 'తిరగబడ్డ తెలుగు బిడ్డ'. ఈ చిత్రానికి కథని అందించింది పరుచూరి బ్రదర్స్. ఎన్టీఆర్ కి వాళ్ళు కథ చెప్పినప్పుడు ఆయనకి విపరీతంగా నచ్చేసింది. ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ క్యారెక్టర్ లో నటించాలి. బాలయ్యకి పోలీస్ రోల్ చాలా బావుంటుంది అని ఎన్టీఆర్ అన్నారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డిని పిలిపించారు. 

 

35

కథ గురించి చెప్పి కోదండ రామిరెడ్డిని ఎలా ఉంది అని ఎన్టీఆర్ అడిగారు.  అడిగింది ఎన్టీఆర్ అయినప్పటికీ కోదండ రామిరెడ్డి నిజాయతీగా నాకు నచ్చలేదు సార్ అని చెప్పేశారట. దీనితో ఎన్టీఆర్ ఒక్క నిమిషం ఆలోచించి.. ఒకే దర్శకుడికి కథ నచ్చకపోతే ఈ చిత్రాన్ని క్యాన్సిల్ చేసేయండి. మరో కొత్త కథ రాయండి బ్రదర్స్ అని పరుచూరి బ్రదర్స్ ని ఎన్టీఆర్ ఆదేశించారు. బయటకి వచ్చాక పరుచూరి బ్రదర్స్.. కోదండ రామిరెడ్డిని బాగా తిట్టేశారట. ఏంటండీ మీరు పెద్దాయనకి నచ్చిన కథని నచ్చలేదు అని ముఖం మీదే చెప్పేశారు. ఆయనకి లేని అభ్యంతరం మీకు ఎందుకు అని అడిగారట. 

 

45
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

దీనితో కోదండ రామిరెడ్డి.. లేదండీ ఆయన అడిగారు నా ఒపీనియన్ చెప్పాను అని అన్నారు. ఒక వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి కోదండ రామిరెడ్డికి ఫోన్ వచ్చింది. బ్రదర్ నాకెందుకో ఈ చిత్రం బావుంటుంది అనిపిస్తోంది. బాలయ్యకి పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాగైనా ఈ చిత్రం చేయండి అని అడిగారు. దీనితో కోదండ రామిరెడ్డి.. ఆయన స్వయంగా చేయమని ఆర్డర్ వేశాక చేసేదేముంది. వెంటనే సినిమా ప్రారంభించాం. 

 

55
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

బాలయ్య కి కూడా ఈ చిత్ర కథ నచ్చలేదు. చిత్ర యూనిట్ లో చాలా మందికి నచ్చలేదు. షూటింగ్ జరుగుతుంటే ఒక సన్నివేశానికి వన్ మోర్ టేక్ అని అడిగా. బాలయ్య వెంటనే.. అట్టర్ ఫ్లాప్ అయ్యే చిత్రానికి వన్ మోర్ టేక్ ఎందుకు సార్ అని ఓపెన్ గా అన్నారు. అలా కాదులే బాలయ్య మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పా. అవసరం లేదు సార్.. ఈ సినిమా ఫ్లాప్ అని బాలయ్య షూటింగ్ దశలోనే డిసైడ్ చేసేశారు. సినిమా రిలీజై నిజంగానే డిజాస్టర్ అయింది.  ఈ చిత్రంలో బాలయ్యకి హీరోయిన్ గా భానుప్రియ నటించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image3
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved