MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ వివాదాలు.. గతంలో కూడా ఇలానే నోరు జారిన బాలయ్య,

బాలకృష్ణ వివాదాలు.. గతంలో కూడా ఇలానే నోరు జారిన బాలయ్య,

బాలయ్యకు కోపం వస్తే అంతే.. ఆయన మాట కఠినంగా ఉంటుంది. ఏం అంటారో ఎవరూ ఊహించలేదు. ఇలా మాట్లాడే చాలా సందర్భాల్లో చిక్కుల్లో ఇరుక్కున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం అక్కినేని పై బాలయ్య కామెంట్ల కాంట్రవర్సీ నడుస్తోంది. ఇక గతంలో ఆయన నోరు జారిన సందర్భాలు ఎన్నో.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 25 2023, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో.. ఎమ్మెల్యే.. సఘసేవకుడు.. తెలుగు నాట అతి పెద్ద సినిమా,రాజకీయ కుటుంబం కలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యాక్తిపూ సాధారణంగా వివాదాలు ఉంటాయి. కాని వాటిని కదిలించి మరీ సంచలనం అవ్వడం ఆయన ఒక్కడికే దక్కింది. బాలయ్య కోపిస్టీ అంటారు చాలా మంది. ఆయన ఎంత కోపం ఉన్నా.. మనసు మాత్రం వెన్న అంటారు మరికొంత మంది. ఎవరు ఎన్ని అన్నా.. బాలయ్య ఎక్కువ వివాదం అయ్యింది మాత్రం ఆయన నోరు జారడం వల్లే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Balakrishna

Balakrishna

అభిమానులను కొట్టడం, ఇబ్బంది పెట్టినవారిపై ఫైర్ అవ్వడం.. సినిమా ఫంక్షన్లలో కూడా రకరకాలుగా ప్రవర్తించడం బాలయ్యకే  చెల్లింది. కాకపోతే సెలబ్రిటీలను కావాలని ఇబ్బది పెట్టేవారిని కొట్టడం తప్పులేదు.. బాలయ్య చేసేది కరస్టేు అంటుంటారు చాలా మంది సినిమా వాళ్ళు.. అదేంటి అలా కొట్టడం తప్పు కదా అంటారు మరికొంత మంది. ఈక్రమంలో ఆయన చేతలతో పాటుగా మాటలు కూడా అంతే వివాదం అవుతున్నాయి.  

37

ప్రస్తుతం అక్కినేనిని.. ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ.. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో అన్న మాటలు.. వివాదం అవుతున్నాయి. ఈక్రమంలో రీసెంట్ గానే మరో వివాదం ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ విషయంలో అయినా... ఉదాహరణలతో పాటుగా.. సంసృత స్లోకాలు వినిపిస్తుంటాడు బాలకృష్ణ. ఈక్రమంలో ఓ సందర్భంలో దేవ బ్రహ్మణులకు.. రావణ బ్రహ్మకు లింక్ పెడుతూ.. బాలయ్య చేసిన వాఖ్యలు దుమారం రేపాయి. దాంతో ఆయన అఫీషియల్ గా వారికి క్షమాపణలు చెపుతూ.. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

47

 అప్పుడేదో క్షమాపణలు చెప్పారు కాని.. ఆయన అలా చెప్పడం అనేది చాలా అరుదు. గతంలో ఇలాంటి వివాదాల్లో.. ఇలాంటి మాటలెన్నో అన్నారు నటసింహం. ఇండస్ట్రీ అంతా కరోనా టైమ్ లో.. టికెట్ రేట్ల గురించి.. ఇండస్ట్రీ కష్టాల గురించి సీఎంలను కలిసినప్పుడు.. బాలయ్యను ఆహ్వానించకపోవడం వివాదం అయ్యింది. ఆ విషయం గురించి స్పందిస్తూ.. వాళ్లు భూముల గురించి మాట్లాడుకోవడానికి వెళ్లినట్టున్నారు అని బాలయ్య అనడం చాలా పెద్ద వివాదానికి దారి తీసింది. కాని ఈ విషయంలో చాలా స్టాండెడ్ గా నిలబడ్డాడు మాస్ హీరో. 

57

ఇక చాలా కాలం క్రితం నంద‌మూరి న‌ట‌సింహం సావిత్రి ఆడియో ఫంక్ష‌న్ కి గెస్ట్ గా అడెండ్ అయ్యారు. ఈక్రమంలో స్టేజ్ మీదనే ఆయన  అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి..కడుపు అయినా చేయాలి...అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు అప్పట్లో వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత ఈ వ్యాఖ్య‌ల‌పై రాజకీయ దుమారం కూడా రేగిది. చాలా మంది వాటిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో బాల‌య్య మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 

67
Balakrishna Unstoppable show

Balakrishna Unstoppable show

ఈ సంఘ‌ట‌న జరిగి 45 రోజులలోనే మరోసారి ఇలాంటి మాటలతోనే వివాదం అయ్యారు బాలయ్య. ఆడియో వేడుక‌లో మ‌రోసారి నోరు జారారు.త్రిష న‌టించిన నాయ‌కి ఆడియో ఫంక్ష‌న్ కి బాల‌కృష్ణ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ ఆడియో వేడుక పై బాల‌య్య మైక్ ఆన్ లో లేదు అనుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటేు.. సిగ‌రెట్ తాగ‌నివ్వ‌రు అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోనివ్వ‌రు, క‌డుపు చేస్తా అంటే అదీ కాదంటారు..అంటూ ఆయన అన్న మాటలు వివాదానికి దారి తీశాయి. 

77

ఇవే కాదు బాల‌య్య అన్న చాలా మాటలు సరదాకి అన్నా కూడా.. సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉంటాయి. అవి హల్ చల్ చేస్తుంటాయి.  మ‌రి ముఖ్యంగా ఆడియో వేడుకల్లో ఆయన మాటలు సెన్సేషన్ అవుతుంటాయి. ఆ విషయంలో ఆయన తొందరపాటు వివాదాల్లోకి నెడుతుంటుంది. ఇక ముందు ముందు ఇంకెన్ని వివాదాలు బాలయ్య వల్ల తెరపైకి వస్తాయో అని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలాగుకుంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved