భగవంత్ కేసరి సెన్సార్ టాక్ ఇదిగో.. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే విస్ఫోటనమే, బొమ్మ నెక్స్ట్ లెవల్ స్టఫ్
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే.
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. అందులోనూ వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదరహో అనిపించింది. బాలకృష్ణ తొలిసారి తెలంగాణ యాసలో నటిస్తున్న చిత్రం ఇది. రిలీజ్ కి ముందే ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఏర్పడింది. తాజాగా భగవంత్ కేసరి చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది.
సెన్సార్ సభ్యులు బాలయ్య చిత్రానికి యుఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రానికి 2.44 గంటల లెంతీ రన్ టైం లాక్ చేశారు. అంతే కాలేదు సెన్సార్ టాక్ కూడా బయటకి వచ్చింది. నందమూరి అభిమానులు పండగ చేసుకునే విధంగా సెన్సార్ నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ లో బాలయ్య, శ్రీలీల మధ్య కాస్త ఎమోషన్, కాస్త ఫన్ తో సన్నివేశాలు రిఫ్రెషింగ్ గా ఉంటాయట. బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ స్టఫ్ ని అనిల్ రావిపూడి థ్రిల్ కి గురిచేసే విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంటర్వెల్ సన్నివేశం మరో ఎత్తు అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ థియేటర్స్ లో ఒక భారీ విస్ఫోటనం లా ఉంటుంది అని అంటున్నారు.
బాలయ్య ఎనెర్జీకి కండరాలు బిగుసుకుపోయేంత గూస్ బంప్స్ స్టఫ్ ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ లో హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు.. బాలయ్య క్రేజ్ ని పక్కాగా ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయని అంటున్నారు.
ఓవరాల్ గా బోయపాటి బాలయ్యకి ఒకరకమైన క్రేజ్ తీసుకువస్తే.. అనిల్ రావిపూడి బాలయ్యని మాస్ అండ్ ఎమోషన్ తో పాటు స్టైలిష్ గా కూడా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరి చిత్రం దసరాకి సూపర్ హిట్ కావడం పక్కా అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి.